- స్కార్పియో రేంజ్ లోస్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో ఎన్ లభ్యం
- గత నెలలో భారీగా తగ్గిన డీజిల్ వేరియంట్ల ఎగుమతులు
మహీంద్రా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అప్‌డేటెడ్ స్కార్పియో ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్ అనే రెండు స్కార్పియోలను విక్రయిస్తోంది. దీని కంపెనీ ఈ మోడళ్ల విక్రయాల సంఖ్యను వెల్లడించగా, దీనితో పాటు గత నెల నుండి ఎగుమతుల సంఖ్యను కూడా వెల్లడించింది.
జనవరి 2024 నాటికి మహీంద్రా స్కార్పియో రేంజ్ యొక్క డీజిల్ వేరియంట్‌లు మొత్తం 13,528 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. పెట్రోల్ వేరియంట్‌లు మాత్రం 765 యూనిట్ల విక్రయాన్ని నమోదు చేయగా, డీజిల్ వేరియంట్‌లు గత నెల నాటికి ఎస్‌యువి అమ్మకాలలో 94 శాతం వరకు చేరుకున్నాయి. అలాగే గత ఏడాదితో పోలిస్తే, ఇదే కాలంలో డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్‌లలో కార్‌మేకర్ వరుసగా 8,061 యూనిట్లు మరియు 654 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.
ఉత్పత్తి సంఖ్యల పరంగా చూస్తే, మహీంద్రా డీజిల్ మరియు పెట్రోల్ స్కార్పియో రేంజ్ లో వరుసగా 15,745 యూనిట్లు మరియు 1,171 యూనిట్లను తయారు చేయగా, గతేడాది ఇదే కాలంలో ఉత్పత్తి చేసిన 9,316 యూనిట్లు మరియు 694 యూనిట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అనే చెప్పవచ్చు. అదనంగా, ఎస్‌యువి యొక్క ఎగుమతులు జనవరి 2023లో నుండి గత నెల వరకు చూస్తే 587 యూనిట్ల నుండి 170 యూనిట్లకు వరకు భారీగా తగ్గాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప