- 7 మరియు 9-సీటర్ కాన్ఫిగరేషన్లలో 4 వేరియంట్లలో లభ్యం
- కేవలం 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ తో మాత్రమే అందించబడుతున్న మోడల్
మహీంద్రా & మహీంద్రా కంపెనీ సెలెక్టెడ్ ఎస్‍యూవీలపై జనవరి 1, 2024 నుంచి ధరలను పెంచింది, అందులో స్కార్పియో క్లాసిక్ మోడల్ కూడా ఉంది. ఈ 3-వరుసల ఎస్‍యూవీపై వేరియంట్ ని బట్టి రూ.33,500 వరకు ధర పెరిగింది. ప్రస్తుతం, ఇది S మరియు S11 అనే రెండు వేరియంట్లలో అందించబడుతుండగా, దీనిని 7 మరియు 9 సీటర్ కాన్ఫిగరేషన్లలో పొందవచ్చు.
Sవేరియంట్ పై రూ. 33,500 ధర పెరగగా, S11వేరియంట్ పై ఇప్పుడు రూ.29,199 పెరిగింది. గమనించాల్సిన అంశం ఏంటి అంటే, S11 CC వేరియంట్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు.
స్కార్పియో క్లాసిక్ యొక్క బిఎస్6 ఫేజ్-2 మరియు ఆర్‌డీఈ కంప్లైంట్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 130bhp పవర్ మరియు 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో మాత్రమే జతచేయబడి కారు రియర్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
వేరియంట్-వారీగా మహీంద్రా స్కార్పియో క్లాసిక్ యొక్క అప్‍డేటెడ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
S 7-సీటర్ | రూ. 13,58,600 |
S 9-సీటర్ | రూ. 13,83,600 |
S11 | రూ. 17,34,800 |
S11 CC | రూ. 17,05,601 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్