- బ్లాక్ కలర్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ ని పొందిన బాస్ ఎడిషన్
- డీలర్ షిప్-లెవెల్ ఫిట్మెంట్ తో లభ్యం
స్కార్పియో క్లాసిక్ మోడల్ లో స్పెషల్ బాస్ ఎడిషన్ కొత్తగా రావడంతో మహీంద్రా డీలర్ షిప్స్ ఫెస్టివ్ సీజన్ ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కొత్త ఎడిషన్ ద్వారా, ఈ ఎస్‍యూవీ అగ్రెసివ్ లుక్ తో బయటా మరియు లోపల బ్లాక్డ్-అవుట్ అంశాలను పొందింది, అందులో డీలర్-లెవెల్ యాక్సెసరీస్ ఫిట్మెంట్ కూడా ఉంది.
ఎక్స్‌టీరియర్ పరంగా బయట వైపు, స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ కారు ఫ్రంట్ గ్రిల్ పై, బానెట్ స్కూప్, ఫాగ్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్, రియర్ రిఫ్లెక్టర్స్, డోర్ హ్యాండిల్, రియర్ క్వార్టర్ గ్లాస్, మరియు హెడ్ ల్యాంప్స్ వంటి వాటిపై డార్క్ క్రోమ్ గార్నిష్ ని పొందింది. ఇంకా చెప్పాలంటే, ఓఆర్‍విఎంస్ కూడా కార్బన్-ఫైబర్ ఎఫెక్టుతో డార్క్ క్రోమ్ ఫినిషింగ్ ని పొందింది. ఇంకా, కారు అన్నీ డోర్లకు రెయిన్ వైజర్స్ కూడా ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా, స్కార్పియో క్లాసిక్ స్పెషల్ ఎడిషన్ కారు లోపల కంఫర్ట్ కిట్ తో పాటుగా బ్లాక్ సీట్ అప్హోల్స్టరీతో వచ్చింది. అందులో నెక్ (మెడ భాగంలో) పిల్లోస్ మరియు కుషన్స్ ఉన్నాయి. ఈ ఎడిషన్ తో, ఎస్‍యూవీ డైనమిక్ గైడ్ లైన్స్ ఫీచర్ తో రియర్ పార్కింగ్ కెమెరాను పొందింది.
మెకానికల్ గా, స్కార్పియో క్లాసిక్ స్పెషల్ ఎడిషన్ కారు పవర్ ట్రెయిన్ మరియు గేర్ బాక్స్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు లేకుండా వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ స్పెషల్ ఎడిషన్ లిమిటెడ్-రన్ సేరీస్ గా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. మహీంద్రా అధికారిక డీలర్ షిప్స్ వద్ద ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు లభ్యమవుతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్