- పెట్రోలు మరియు డీజిల్ రెండింట్లో లభించనున్న మోడల్
- త్రీ-డోర్ కంటే మరిన్ని ఫీచర్లను పొందనున్న ఫైవ్-డోర్
మహీంద్రా థార్ ఫైవ్-డోర్ కొంతకాలంగా వార్తల్లో కనిపిస్తుంది. ఇప్పుడు, దీని మానుఫాక్చరర్ ఎట్టకేలకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఎస్‌యువి యొక్క లాంచ్ టైమ్‌లైన్‌ను ప్రకటించింది. మారుతి జిమ్నీకి పోటీగా ఉండే ఈ మోడల్, ఆర్థిక సంవత్సరం 2025లోని ద్వితీయార్థంలో ఇండియాలో లాంచ్ అవుతుంది.
ముందు భాగంలో డిజైన్ పరంగా చూస్తే, ఫైవ్-డోర్ థార్ దాని త్రీ--డోర్ మాదిరిగా ఉండే దానితో పోలిస్తే పెద్ద వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది, దీనివల్ల క్యాబిన్ లోపల ఎక్కువ స్థలం ఉంటుంది. ఇంతేకాకుండా, ఇది న్యూ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్, డిఆర్ఎల్ఎస్ తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పెద్ద 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు మూడవ వరుసలో రెండు సీట్ల జోడింపును పొందుతుంది.
ఈ రాబోయే ఎస్‌యువి వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, సింగిల్-పేన్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 360-డిగ్రీ కెమెరాతో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను పొందుతుందని కొత్త స్పై షాట్‌లో కనిపించింది. ఇతర ముఖ్యమైన ఫీచర్లు పరంగా చూస్తే, వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ముందు పార్కింగ్ సెన్సార్స్ మరియు ఎలక్ట్రిక్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ వంటివికూడా ఉండనున్నాయి.
కింది భాగంలో, మహీంద్రా థార్ ఫైవ్-డోర్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందని అంచనా, ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ వరుసగా 200bhp/380Nm మరియు 172bhp/400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 6 -స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప