- XUV.e8 ఈవీతో కిక్‌స్టార్ట్ చేయనున్న మహీంద్రా
- BE.05, BE.07 మరియు BE.09లహక్కులను రిజిస్టర్ చేసిన మహీంద్రా
మహీంద్రా రాబోయే వివిధ ఈవీల డిజైన్హక్కులను పొందింది, ఇవి రాబోయే నెలల్లో లాంచ్ కానున్నాయి. దీని కార్‌మేకర్ ఈ ఏడాది చివర్లో XUV700-బేస్డ్ XUV.e8తో ఎలక్ట్రిక్ఎస్‍యూవీతో వీటి లాంచ్ లను మొదలుపెట్టనుంది.
మహీంద్రా XUV.e8 తర్వాత BE.05ని వచ్చే ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేయనుంది. ఈ మోడల్ యొక్క టెస్ట్ మ్యూల్స్ ఇప్పటికే అనేక సందర్భాల్లో కనిపించగా, మరియు ఈ మోడల్ చిత్రాల ద్వారా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నరూపంతో కనిపించింది. ఈ బ్రాండ్ BE.05 రల్ -E అనే ఆఫ్-రోడ్-ఫోకస్డ్ వెర్షన్‌ను కూడా అదే సమయంలో పరిచయం చేస్తుంది. ఈ రెండు కార్లు 60kWh బ్యాటరీ ప్యాక్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడి పవర్ ని అందుకోనున్నాయి.
అదే వరుసలో మహీంద్రా BE.07 ఉండగా, ఇది అక్టోబర్ 2026లో రాబోతుంది , అయితే BE.09 దాని తర్వాత సంవత్సరంలో వస్తుంది. రెండోది కూపే ఎస్‍యూవీ మరియు ఈ మూడు ఎలక్ట్రిక్ ఎస్‍యూవీల పైన ఉండగా, BE.07 మూడు మోడళ్ల మధ్య స్లాట్ చేయబడుతుంది.పేటెంట్ చిత్రాలు బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, సీ-షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ఏరో అల్లాయ్ వీల్ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి మరిన్నింటిని వెల్లడిస్తున్నాయి. ఈ మూడు ఎస్‍యూవీలు వాటికి సంబంధించిన డిజైన్ మరియు సిల్హౌట్ మెజారిటీని కలిగి ఉంటాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప