- 31డిసెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న కొత్త తీసుకువచ్చిన బెనిఫిట్స్
- ఆక్టివ్ అర్‌ఎస్‍ఏ ప్రోగ్రామ్ లో లేని కస్టమర్లకు కూడా అందుబాటులో ఉన్న ఉచిత టోయింగ్
మిచౌంగ్ తుఫానుకు ప్రతిస్పందించిన మహీంద్రా ప్రభావిత కస్టమర్లకు సహాయం చేయడానికి ఒక చొరవను ప్రకటించింది. మహీంద్రా ఎస్‌యువి యజమానులకు చొరవలో భాగంగా కంపెనీ అనేక విధాలుగా మద్దతును అందిస్తుంది. ఇందులో ప్రధాన అంశాలుగా కాంప్లిమెంటరీ అర్‌ఎస్‍ఏ, నో-కాస్ట్ ఇన్స్పెక్షన్ మరియు డ్యామేజ్ అసెస్‌మెంట్ మరియు ప్రత్యేక డిస్కౌంట్స్ ద్వారా ఫైనాన్షియల్ రిలీఫ్ అందించే ప్లాన్స్ ఉన్నాయి.
మహీంద్రా ప్రభావిత వెహికల్స్ సమీపంలోని మహీంద్రా అధికారిక వర్క్‌షాప్‌కు వెళ్లేందుకు 50కి.మీ రేంజ్ లో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (అర్‌ఎస్‍ఏ)ని అందజేస్తుంది. ఈ సర్వీస్ ఆక్టివ్ అర్‌ఎస్‍ఏ ప్రోగ్రామ్ లేని వారితో సహా అందరికీ వర్తిస్తుంది. ఇంకా, కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా సమగ్ర చర్యలను నిర్వహించడానికి మరియు నష్టాన్ని అంచనా వేయడానికి సర్వీస్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి .
కస్టమర్లపై ఆర్ధిక భారాన్ని తగ్గించడంలో సహాయపడటానికి, మహీంద్రా రిపేర్ ఇన్‌వాయిస్‌లోని కస్టమర్ లయబిలిటీ కాంపోనెంట్‌పై ప్రత్యేక డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇంతే కాకుండా, ఈ చొరవ 31 డిసెంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, మహీంద్రా తన కస్టమర్‌లకు మరింత నష్టం కలుగకుండా నివారించడానికి వారి ఎస్‌యువిలను స్టార్ట్ చేయవద్దని కూడా హెచ్చరించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప