- కనెక్టెడ్ 3-స్క్రీన్ లేఅవుట్ ని పొందనున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ
- ఇల్యూమినేటెడ్ లోగోతో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ తో రానున్న నయా మోడల్
మహీంద్రా కంపెనీ ప్రస్తుతం వివిధ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్స్ పై వర్క్ చేస్తుండగా, వచ్చే సంవత్సరం నుంచి ఒకదాని తర్వాత ఒక మోడల్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతXU400 మోడల్ లోని దాని ఐసీఈ వెర్షన్ లాగే ఒకే రకమైన ఇంటీరియర్ థీమ్ తో కాకుండా, ఈ ఫ్యూచర్ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్స్ భారీగా మార్పులతో ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ ని పొందనున్నాయి.
ఇక్కడ కనిపిస్తున్న డ్యాష్ బోర్డు ఫోటో XUV.e8 మోడల్ కి సంబంధించినది కాగా, ఈ కూపే వెర్షన్ XUV700-బేస్డ్ ఈవీగా వచ్చింది. ఫోటోలో చూసినట్లుగా, ఎస్‍యూవీ క్యాబిన్లో అతి పెద్ద హైలైట్ ఏంటి అంటే, ఇది 3-స్క్రీన్ లేఅవుట్ సెటప్ తో రానుండగా, ఇలాంటి సెటప్ ని సాధారణంగా మనం హై-ఎండ్ లగ్జరీ కార్లలో మాత్రమే చూస్తూ ఉంటాం.
ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ XUV700 కారులో అందించినట్లుగా ఒకేలా ఉన్నాయి. అయితే, ఇక్కడ కో-డ్రైవర్ కోసం మల్టీమీడియా డిస్ ప్లే ఒక్కటే కొత్తగా చేర్చబడింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, స్టీరింగ్ వీల్ కొత్త ట్రీట్ మెంట్ ని పొందనుంది. ఇది ఎలా ఉంది అంటే, టాటా మోటార్స్ దాని కొత్త రేంజ్ లోని ఎస్‍యూవీలలో అందించినట్లుగా ఉంది.
ఇంకా ఈ ఎలక్ట్రిక్ మోడల్ ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ కి ఇరు వైపులా కంట్రోల్ బటన్లతో ఇల్యూమినేటెడ్ మహీంద్రా లోగోని పొందనుంది. ముఖ్యంగా, మహీంద్రా కొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఐడెంటిటీని చూపించే విధంగా ఇన్ఫినిటీ బటర్ ఫ్లై ‘M’ లోగో ఉండనుంది. ఇంకా ఇందులోని ఇతర అంశాలలో సెంటర్ కన్సోల్ మరియు XUV700 వెర్షన్ నుంచి తీసుకోబడ్డ హెచ్‍విఎసి ప్యానెల్ వంటివి ఉన్నాయి.
ఫీచర్ల పరంగా, అప్ కమింగ్ మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్ –అడ్వాన్స్డ్ డ్రైవర్ ఆసిస్టెన్స్ సిస్టం)సూట్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
ఫోటో 2 మరియు 3 మూలం - రష్‌లేన్
అనువాదించిన వారు: సంజయ్ కుమార్