- నవంబర్-23లో 2.85 లక్షలకు పైగా బుకింగ్స్ సాధించిన మహీంద్రా
- 1.19 లక్షల బుకింగ్స్ తో అగ్రభాగంలో నిలిచిన స్కార్పియో రేంజ్
తాజాగా నవంబర్-2023లో సాధించిన ఓపెన్ బుకింగ్స్ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆటోమేకర్ దేశవ్యాప్తంగా 2.85 లక్షలకు పైగా కార్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఈ ఆర్టికల్ ద్వారా మనం బొలెరో రేంజ్ పై ఎంత ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉందో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం నవంబర్ వరకు, బొలెరో మరియు బొలెరో నియోలతో పాటుగా మహీంద్రా బొలెరో రేంజ్ లో 11,000 ఓపెన్ బుకింగ్స్ సాధించింది. అదే విధంగా, ఈ రెండు కార్లు ప్రతి నెలలో యావరేజ్ గా 9,000 బుకింగ్స్ అందుకుంటున్నాయి.
ఇదే సమయంలో, మహీంద్రా ప్రతి నెలలో యావరేజ్ గా 51,000 బుకింగ్స్ అందుకుంటుండగా, ఈ ఆర్ధిక సంవత్సరం-2024 రెండవ అర్ధ భాగంలో ఈ బ్రాండ్ యొక్క డీలర్ స్టాక్ సుమారు 30 రోజులు మాత్రమే ఉంది. నెలాఖరు స్టీల్ కొరత కారణంగా ప్రొడక్షన్ ని పెంచడం కష్టంగా మారిందని బ్రాండ్ అంగీకరించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్