- ఈరేంజ్ లో కలిపి ఉన్న బొలెరో మరియు బొలెరో నియో
- కేవలం డీజిల్ ఇంజిన్‌లతో మాత్రమే లభ్యం
ఈ వారం ప్రారంభంలో, మేము సెప్టెంబర్ 2023కి సంబంధించి మోడల్ వారీగా మహీంద్రా కార్ల అమ్మకాల వివరాలను కలిగి ఉన్నాము మోడల్స్ కి సంబంధించి ఫ్యూయల్ వారీగా అమ్మకాలలో ఎక్స్‌యువి700 మరియు స్కార్పియో రేంజ్ కి గురించి ఆసక్తికరమైన వివరాలను ప్రకటించింది. ఈ విషయంలో బొలెరో రేంజ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో, మహీంద్రా మొత్తం 9,519 యూనిట్లను ఉత్పత్తి చేసింది మరియు ఇందులో స్టాండర్డ్ బొలెరోతో పాటు బొలెరో నియో ఎస్‌యువిస్ కూడా ఉన్నాయి. అదే సమయంలో, కార్ల తయారీ కంపెనీ మోడల్ వారీగా అమ్మకాలను లేదా ఉత్పత్తి సంఖ్యను ఇంకా ప్రకటించలేదు. అదనంగా,మహీంద్రా అదే కాలంలో 8,108 యూనిట్ల ఉత్పత్తిని నమోదు చేసింది, గత సంవత్సరం పోల్చితే 16 శాతం అదనంగా వార్షికవృద్ధిని నమోదు చేసింది.
మహీంద్రా బొలెరో 75bhp మరియు 210Nm అవుట్‌పుట్ ఉత్పత్తి చేయడానికి 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో జత చేయబడిన 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. మరోవైపు, బొలెరో నియో 100bhp మరియు 260Nm ఉత్పత్తి చేసే పవర్డ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది,ఈ ఇంజిన్5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా వీల్స్ కి పవర్ ని సరఫరా చేస్తుంది.
అనువాదించిన వారు:రాజపుష్ప