- ఇప్పటి వరకు 2.2 లక్షలకు పైగా బుకింగ్స్ కలిగి ఉన్న మహీంద్రా
- మరికొన్ని నెలల్లో ప్రొడక్షన్ కెపాసిటీని పెంచనున్న మహీంద్రా కంపెనీ
మహీంద్రా కంపెనీ తాజాగా మే-2024లో పెండింగులో ఉన్న బుకింగ్స్ వివరాలను వెల్లడించింది. కార్ మేకర్ మహీంద్రా ఇప్పటివరకు 2.2 లక్షల యూనిట్లకు పైగా కార్లను కస్టమర్లకు డెలివరీ చేయాల్సి ఉండగా, అయినా కూడా అన్ని మోడల్స్ పై ఫ్రెష్ ఆర్డర్లను అందుకోవడం మాత్రం అస్సలు ఆపడం లేదు. వాటిని యథావిధిగా కొనసాగిస్తుంది.
రానున్న మరికొన్ని నెలల్లో 2.2 లక్షల కార్లను కస్టమర్లకు డెలివరీ చేయడానికి మహీంద్రా కంపెనీ ప్లాన్ చేస్తుండగా, అందులో 10,000 పైగా బొలెరో రేంజ్ మోడల్స్ ఉన్నాయి. బొలెరో రేంజ్ లో బొలెరో మరియు బొలెరో నియో వంటి మోడల్స్ ఉండగా, ఈ మోడల్స్ ప్రతి నెలా 9,500 పైగా ఫ్రెష్ బుకింగ్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా, ఈ నెల ప్రారంభంలో బొలెరో నియోపై ధర పెరగగా, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా వెబ్ సైట్ ని సందర్శించి చదువగలరు.
ముఖ్యంగా, ఎస్‍యూవీ మేకర్ నుంచి తాజాగా వచ్చిన మహీంద్రా XUV 3XO కేవలం ఒక్క గంటలోనే 50,000 పైగా బుకింగ్స్ అందుకుని సరికొత్త రికార్డును సాధించింది. నెక్సాన్ మరియు బ్రెజాతో పోటీ పడుతున్న XUV 3XO డెలివరీ ప్రారంభమైన మూడు రోజుల్లోనే మహీంద్రా కంపెనీ 2,500 యూనిట్లకు పైగా డెలివరీ చేసింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్