- చైల్డ్ మరియు అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ లో ఒకే విధమైన స్కోర్స్ పొందిన బొలెరో నియో
- ఇందులోస్టాండర్డ్ గా రెండు ఎయిర్‌బ్యాగ్స్ లభ్యం
మహీంద్రా బొలెరో నియోని ఇటీవలే సేఫ్టీ రేటింగ్స్ కోసం జిఎన్ క్యాప్ ద్వారా టెస్టింగ్ నిర్వహించబడింది. ఈ టెస్టింగ్ లో ఎస్‌యువి కేవలం 1 స్టార్ స్కోర్ చేయగలిగింది. అయితే, XUV700 మరియు స్కార్పియో N వంటి బ్రాండ్ ఇటీవలి మోడళ్లు క్రాష్ టెస్ట్‌లలో పూర్తిగా 5 స్టార్ స్కోర్ చేయడంతో మహీంద్రా నుండి వచ్చిన బొలెరో నియో ఇలాంటి ఫలితాలను పొందడం అందరిని చాలా నిరాశపరిచింది.
మహీంద్రా బొలెరో నియోలో రెండు ఎయిర్‌బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్స్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్ మరియు లోడ్ లిమిటర్స్ ఉన్నాయి. ఈ టెస్టింగ్ ఫలితాల విషయానికి వస్తే, ఎస్‌యువి అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ లో 34 పాయింట్లకు 20.26 పాయింట్లను మాత్రమే పొందింది. మరోవైపు , చైల్డ్సేఫ్టీ రేటింగ్స్ లో, బొలెరో నియో 49 పాయింట్లకు 12.71 పాయింట్లను మాత్రమే స్కోర్ చేయగలిగింది.
రిపోర్ట్ ప్రకారం చెప్పాలంటే, ఎస్‌యువి లో డ్రైవర్ సేఫ్టీని చూస్తే చెస్ట్ (ఛాతి) మరియు ఫీట్ ప్రొటెక్షన్స్ కొంచెం వీక్ గా ఉన్నట్లు కనిపించింది. అలాగే, కారు రూపం, బాడీ షెల్ ఫుట్‌వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నట్లు రేట్ చేయబడింది.
ఎస్‌యువిలో సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి వివిధ సేఫ్టీఫీచర్స్ అందుబాటులో లేకపోగా, మరియు అన్ని సీట్లకు మూడు-పాయింట్ సీట్ బెల్ట్స్ రిమైండర్స్ కూడా లేకపోవడంతో తక్కువ సేఫ్టీ రేటింగ్‌లను పొందింది. అంతేకాకుండా, ఈ కార్ క్రాష్ టెస్ట్ లో పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడానికి మూడవ వరుసలో పక్కకు ఎదురుగా ఉండే సీట్లు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప