- ఇండియాలో రూ.9.90 లక్షలతో (ఎక్స్-షోరూమ్) ప్రారంభంకానున్న బొలెరో నియోధరలు
- 8N వేరియంట్ పై మాక్సిమం పెరిగిన ధర
క్రిందటి నెలలో, మహీంద్రా తన ఎస్‌యువిపై 1 జనవరి, 2024 నుండి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇప్పుడు కార్‌మేకర్బొలెరో నియోతో సహా దాని అన్ని కార్ల పై పెరిగిన ధరల పరిమాణాన్నివెల్లడించింది .తాజాగా ధరల పెంపుతో ను , బొలెరో నియో ధర రూ. 33,300 వరకు పెరిగింది.
ఈ మహీంద్రా బొలెరో నియో 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, అవి-N4, N8, N10, మరియు N10(O). కాగా బొలెరో నియో N8 వేరియంట్ పై మాక్సిమం రూ. 33,300,వరకు పెరగగా, N4 మరియు N10 వేరియంట్‌లపై మాత్రం రూ. 25,300 వేల మరియు రూ.10,000 వేల వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, N10(O) వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు.
మెకానికల్‍గా చూస్తే, ఈమూడు-వరుసల ఎస్‌యువి పవర్డ్ 1.5-లీటర్, డీజిల్ పెట్రోల్ ఇంజిన్‌తో 100bhp మరియు 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఈ మోటార్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి వెనుక వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
వేరియంట్ వారీగా మహీంద్రా బొలెరో నియో యొక్క ఎక్స్-షోరూం ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | పెరిగిన ధరలు | ఎక్స్-షోరూమ్ ధరలు |
N4 | రూ. 25,300 | రూ. 9,89,601 |
N8 | రూ. 33,300 | రూ. 10,49,799 |
N10 | రూ. 10,000 | రూ. 11,47,499 |
N10(O) | - | రూ. 12,15,500 |
అనువాదించిన వారు: రాజపుష్ప