- రెండు వేరియంట్లలో లభ్యం
- రూ. 11.39 లక్షలతో ధరలు ప్రారంభం
మహీంద్రా కంపెనీ తాజాగా బొలెరో నియో మోడల్ 9-సీటర్ వెర్షన్ ని దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. బొలెరో నియో+ గా పిలువబడుతున్న ఈ మోడల్ రెండు వేరియంట్లలో రూ.11.39 ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు, దీని లాంచ్ తర్వాత, ఈ 3-వరుసల ఎస్‍యూవీ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
కొత్త మహీంద్రా బొలెరో నియో+ P4 మరియు P10 అనే రెండు వేరియంట్లలో అందించబడింది. ఇందులో ఒక మోడల్ అయిన ఎంట్రీ-లెవెల్ P4 వేరియంట్ ప్రశ్నార్థకంగా మారింది. బేస్ వేరియంట్ గా వచ్చిన ఈ మోడల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ సర్దుబాటు చేయగల ఓఆర్‌విఎం, రిమోట్ కీ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ వైపర్, రియర్ డీఫాగర్, అల్లాయ్ వీల్స్ మరియు ఫాగ్ లైట్స్ వంటి ఫీచర్లను మిస్ అయింది. అయితే, ఇది ఎకో మోడ్‌తో మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి వాటిని కలిగి ఉంది. ఇక ఇందులో ఉన్న సీటింగ్ విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్లు 2-3-4 లేఅవుట్ ద్వారా 9-సీటింగ్ కెపాసిటీతో వచ్చాయి.
మెకానికల్ గా, కొత్త బొలెరో నియో+ కొత్త 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జత చేయబడింది. ఈ మోటార్ రియర్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తూ 118bhp పవర్ మరియు 280Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
ప్రస్తుతం ఈ 9-సీటర్ ఎస్‍యూవీకి పోటీగా ఏవీ లేవు. ఒకవేళ, మీరు 5+సీటర్ లాంటి పెద్ద కార్ల కోసం చూస్తున్నట్లయితే, ఆ ధర రేంజ్ లో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి XL6, కియా కారెన్స్, మరియు మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వంటి కార్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్