- స్టీరింగ్ వీల్‌పై ఇల్యూమినేటెడ్ ‘BE’ లోగోతో వస్తున్న ఎలక్ట్రిక్ కారు
- 2025 ద్వితీయార్థంలో అరంగేట్రం
మహీంద్రా దాని వివిధ ఆల్-ఎలక్ట్రిక్ మోడళ్లపై తన పనిని కొనసాగిస్తుండగా, దీనిలో భాగంగా కేవలం ఈవీగా మాత్రమే వస్తున్న BE పై కూడా పని చేస్తుంది. ఇండియన్ ఆటో మేకర్ మరిన్ని సంవత్సరాల్లో BE.05, XUV.e8 మరియు XUV.e9లను లాంచ్ చేయనుంది. ఇప్పుడు, అయితే రెండోది XUV700 బేస్డ్ XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్‌యువిని పరిచయం చేయనుంది. మొదటిది, BE.05, పూర్తిగా గ్రౌండ్-అప్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అలాగే, వివిధ స్పై చిత్రాల తర్వాత, మరిన్ని వివరాలను వెల్లడిస్తూ కూపే ఎస్‌యూవీ ఇంటీరియర్ వివరాల చిట్టా మా చేతుల్లోకి వచ్చింది.
ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, అప్ కమింగ్ (రాబోయే) BE.05 స్టీరింగ్ వీల్ దీనికి గట్టి పోటీని ఇవ్వనున్న టాటా కర్వ్ ఈవీని పోలి ఉంటుంది. దీని మధ్యలో మెరుస్తున్న 'BE' లోగోతో హైలైట్ చేయబడిన ఆక్టాగోనల్ షేప్డ్వీల్ ట్విన్-స్పోక్ డిజైన్‌ను పొందుతుంది. ఇంకా చెప్పాలంటే, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కంట్రోల్స్ కోసం స్టీరింగ్‌కు ఇరువైపులా ఇల్యూమినేటెడ్ బటన్స్ వంటివి ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే, XUV700 మాదిరిగానే, BE.05 ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం కనెక్ట్ చేయబడిన డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఇందులోని యూజర్ ఇంటర్‌ఫేస్ కొత్తగా కనిపిస్తుంది. అలాగే, అప్ కమింగ్ (రాబోయే) అన్ని ఇతర ఎలక్ట్రిక్ మహీంద్రా ఎస్‌యూవీలలో ఈవీ-సెంట్రిక్ థీమ్ మరియు లేఅవుట్‌ను కలిగి ఉంటుంది.
మహీంద్రా BE.05 2025 ద్వితీయార్థంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. లాంచ్ తర్వాత, సరికొత్త ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ ఇండియాలో టాటా కర్వ్ ఈవీ, అప్‌డేటెడ్ ఎంజి ZS ఈవీ మరియు బివైడి అటో 3 వంటి కార్లకు పోటీగా నిలుస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప