- అక్టోబర్ 2025లో లాంచ్ అవ్వనున్న BE.05 ఈవీ
- రాల్-ఇ వెర్షన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నమహీంద్రా
రాబోయే మహీంద్రాBE.05 భారతదేశంలో మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించింది. రాబోయే సంవత్సరాల్లో ఈ బ్రాండ్ విడుదల చేయనున్న వివిధ ఎలక్ట్రిక్ ఎస్‌యువిలలో ఇది ఒకటి. ఈ ఈవీ లలో, ఎక్స్‌యువి.e8 డిసెంబర్ 2024లో మొదటగా రాబోతుంది.
మహీంద్రా నుంచి ప్రొడక్షన్-రెడీ ఇటరేషన్ లో భాగంగారాబోయే BE.05 ఎస్‌యువి ఇప్పటికే టీజ్ చేసింది, ఇప్పుడు టెస్ట్ మ్యూల్ లో కనిపించే పిక్చర్స్ లో ఇది ఇంకా ప్రీ-ప్రొడక్షన్ బాడీని ధరించి ఉంది . ఈ టెస్ట్ మ్యూల్ లో హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌లైట్స్ మరియు ఈవీ ఛార్జర్ అవుట్‌లెట్ క్యాప్ వంటి ప్రొడక్షన్-స్పెక్ ఎలిమెంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అదే విధంగా ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఫంకీ-లుకింగ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, ఏ-పిల్లర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, వెనుక బంపర్‌పై రిఫ్లెక్టర్స్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి కొన్ని ఇతర ముఖ్యమైన అంశాలు ఈ యూనిట్‌లో ఉన్నాయి. సి- పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ మరియు టెయిల్‌గేట్ మధ్యలో ఉంచబడిన స్టాప్ ల్యాంప్ కూడా ఇందులో ఉన్నాయి.
మహీంద్రా BE.05 ఇంటీరియర్ లోమునుపటి టీజర్స్ చెప్పినట్లుగా మోడల్ టచ్-బేస్డ్ కంట్రోల్‌లతో కూడిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను మరియు డ్యాష్‌బోర్డ్‌పై రెండు పెద్ద స్క్రీన్‌లను పొందవచ్చు. ఈ స్క్రీన్‌లు టచ్‌స్క్రీన్ యూనిట్ గా మరియు డ్రైవర్ డిస్‌ప్లేగా పని చేస్తాయి. మిగతా వాటిని చూస్తే, ఇది ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ కోసం విశాలమైన సెంటర్ కన్సోల్ ఇన్సర్ట్, ఎయిర్‌క్రాఫ్ట్-స్టైల్డ్ గేర్ లివర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్ విఎం, త్రీ-టోన్ అప్హోల్స్టరీ థీమ్, రోటరీ డయల్ మరియు ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్‌గా పనిచేసే ఫాబ్రిక్ ఇన్‌సర్ట్స్ ఉన్నాయి.
ప్రస్తుతానికి పవర్‌ట్రెయిన్ వివరాలు లేనప్పటికీ, 2025 మహీంద్రా BE.05 ఎలక్ట్రిక్ ఎస్‌యువి లో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడిన60kWh బ్యాటరీ ప్యాక్ ను పొందవచ్చు. కార్‌మేకర్ BE.05 రాల్-ఇ ని కూడా అదే సమయంలో అక్టోబర్ 2025లో ప్రవేశపెట్టవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప