- 2025 ప్రారంభంలో XUV.e8 ఎలక్ట్రిక్ కారు లాంచ్
- ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా 2030లోపు పూర్తి ఎలక్ట్రిక్ రేంజ్ మోడళ్లను కలిగి ఉండనున్న మహీంద్రా
ఆర్ధిక సంవత్సరం-2026 లోపు సుమారు 1.8 లక్షల ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహీంద్రా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో విక్రయించడానికి ఒక్క మోడల్ ని కూడా మహీంద్రా కంపెనీ తయారుచేయలేదు. కానీ, భవిష్యత్తులో విస్తృతంగా అందించేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా, ఎలక్ట్రిక్ కార్లను రెండు దశల్లో తీసుకురానుంది. ఎలా అంటే, ఆర్ధిక సంవత్సరం-2025 లోపు ఒక లక్ష యూనిట్లను మరియు ఆర్ధిక సంవత్సరం-2026 లోపు మరో 80 వేల యూనిట్లను తీసుకువస్తూ ప్రొడక్షన్ కెపాసిటీని మరింత విస్తరించనుంది.
రాబోయే రోజుల్లో, మహీంద్రా కంపెనీ దాని ఈవీ ప్రొడక్షన్ ద్వారా ఆటను మొదలుపెట్టనుంది. రాబోయే రెండు సంవత్సరాలలో మూడు నుండి నాలుగు మోడళ్ల మధ్య 1.8 లక్షల యూనిట్లు రానుండగా, మొదటి సంవత్సరంలో నెలకు 10,000 యూనిట్ల లోపు మరియు రెండవ సంవత్సరంలో తక్కువలో తక్కువ నెలకు 15,000 యూనిట్లు రానున్నాయి. ఒకవేళ మీరు మహీంద్రా కంపెనీ ఓవరాల్ నంబర్లను పరిశీలిస్తే, ఆర్ధిక సంవత్సరం-2025 చివరి నాటికి వివిధ మోడళ్ల ద్వారా మొత్తం 6.4 లక్షల యూనిట్లను, ఆర్ధిక సంవత్సరం-2026 చివరి నాటికి మొత్తం 7.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా మహీంద్రా పనిచేస్తుంది. ఆర్ధిక సంవత్సరం-2026 చివరి వరకు మొత్తం ప్రొడక్షన్ లో 25 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉండనున్నాయి.
ఆటోమేకర్ ఇది వరకే XUV400 అనే చిన్న ఎస్‍యూవీని కలిగి ఉండగా, 2025 ప్రారంభంలో దీని సరసన XUV.e8 మోడల్ చేరనుండగా, దాని తర్వాత 2025-ఏప్రిల్ లో XUV.e9 (కూపే ఎస్‍యూవీ) మరియు 2025-అక్టోబరులో BE.05 వంటి ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. వీటికి అదనంగా కొత్త పేర్లతో BE.05/BE.05 రాల్-ఈ, BE.07, మరియు BE.09 వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్నాయి. అదే విధంగా, 2030లోపు స్కార్పియో మరియు బొలెరో మరియు థార్ కార్లను ఎలక్ట్రిక్ వెర్షన్లలో మహీంద్రా కంపెనీ తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇండియా-మేడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అన్ని ఇక్కడే తయారై డొమెస్టిక్ మార్కెట్లకు ఎగుమతి చేయబడతాయని ఇది వరకే ఆటోమేకర్ మహీంద్రా చిన్న క్లూని అందించింది. అయితే, ముందుగా ఇవి రైట్ హ్యాండ్ డ్రైవ్ (ఆర్ హెచ్ డి) లొకేషన్లకు ఎగుమతి చేయబడిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (ఎల్ హెచ్ డి) లొకేషన్లకు ఎగుమతి చేయబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్