రియల్-వరల్డ్ మైలేజ్ ని టెస్ట్ చేయబడ్డ టాప్-స్పెక్ AX7L 1.5 డీజిల్ మాన్యువల్
1,480 కిలోల బరువు 3XO కారు
మహీంద్రా అండ్ మహీంద్రా 3XO ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది XUV300కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. లోపల భారీగా అప్‌డేట్స్ తో వచ్చింది దాని కేటగిరిలో ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందిన మొట్టమొదటి మోడల్. అలాగే, ఇది అనేక ఫీచర్లలో ఏడీఏఎస్(ఎడాస్)ని కూడా పొందింది. ఈ కారు రెండు టర్బో-పెట్రోలు మరియు ఒక డీజిల్‌తో కలిపి మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్స్ లో అందించబడింది. దీని రియల్-వరల్డ్ మైలేజ్ ని తెలుసుకోవడానికి మేము ఇటీవలి డీజిల్ ఇంజిన్ ని టెస్ట్ చేసాము. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ధర మరియు పవర్‌ట్రెయిన్ వివరాలు
మొదటిగా, ధర మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్ల గూర్చి చెప్పాలంటే, దీని డీజిల్ మోడల్ MX2 వెర్షన్ రూ.9.99 లక్షలు ప్రారంభ ధరను, మరియు టాప్ అవుట్ వేరియంట్ టాప్-ఆఫ్-లైన్ AX7L వెర్షన్ రూ. 14.99 లక్షల ధరను కలిగి ఉంది. . XUV300 వలె, డీజిల్ 3XO 115bhp మరియు 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ యూనిట్‌ను పొందింది. అలాగే, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో మేము టెస్ట్ చేసిన వాటిలో 6 -స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉన్నాయి.
సిటీ మైలేజ్
సిటీలో టెస్టింగ్ చేయడానికి , 3XO కారును ముందుగా మేము అనుకున్న నిర్ణీత మైలేజ్ టెస్టింగ్ రూట్‌లో దీనిని 78.5 కి.మీ. డ్రైవ్ చేశాము. ఇది 6.38 లీటర్ల డీజిల్‌ను వినియోగించింది, ఫలితంగా లీటరుకు 12.3కెఎంపిఎల్ రియల్-వరల్డ్ మైలేజీని పొందాము . ఇది దాదాపు 1.5 టన్ను బరువున్న కారు. . అయితే, దీనిలో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ 13.5కెఎంపిఎల్ఫ్యూయల్-ఎఫిషియన్సీని అందించినట్లు ప్రదర్శించింది.
హైవే మైలేజీ
హైవేపై, 3XO కారును ముందుగా మేము అనుకున్న రూట్ లో 80.5కిలోమీటర్లు డ్రైవ్ చేశాము. కోసం మరియు ఈ కారు లీటరుకు 17.8కెఎంపిఎల్ రియల్-వరల్డ్ ఫ్యూయల్-ఎఫిషియన్సీని అందించింది. ఇది ఎంఐడిలో 20-22కెఎంపిఎల్ చూపడం కొనసాగించినప్పటికీ, చివరిగా 20.7కెఎంపిఎల్ ని చూపించింది. మహీంద్రా 3XO కారు 42 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఫుల్ ట్యాంక్ కెపాసిటీతో ఈ కారు సగటున 600 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప