1
- పెద్ద టచ్‌స్క్రీన్ తో లభించనున్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- 2024లో లాంచ్ అవ్వనున్న మహీంద్రా థార్
గత కొంతకాలంగా భారతదేశంలో 5-డోర్ ఆఫ్ రోడర్ మహీంద్రా థార్ వెర్షన్‌ల టెస్టింగ్ కొనసాగుతుంది. ఇటీవల, ఎస్‌యూవిని టెస్ట్ చేస్తుండగా 5-డోర్ థార్ ఇంటీరియర్ గురించి కొత్త వివరాలు లీక్ అయ్యాయి. లైఫ్ స్టైల్ ఎస్‌యూవిని ప్రస్తుతం భారతదేశంలో 3-డోర్ రూపంలో అమ్మకానికి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.10.54 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) మహీంద్రా కంపెనీ నిర్ణయించింది.
ప్రస్తుత మోడల్‌లా కాకుండా, 5-డోర్ థార్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అమర్చబడింది. ఇందులో 12.3- ఇంచ్ యూనిట్ మరియు, స్టీరింగ్ వీల్ కొత్తగా కనిపిస్తున్నా ఎక్స్ యూవి700 మాదిరిగానే అనిపిస్తుంది. ముఖ్యంగా, వాటి కింద ఉన్న గుండ్రని ఏసీ వెంట్‌లు మరియు కంట్రోల్స్ 3-డోర్ థార్ మాదిరిగానే ఉంటాయి.
అంతేకాకుండా, థార్ ఫైవ్-డోర్ క్యాబిన్ సెంటర్ కన్సోల్ రెండు-విభాగాలను సర్దుబాటు చెయ్యగలిగే ఆర్మ్‌రెస్ట్‌ను కలిగి ఉంది. ఇందులో విండో స్విచ్‌లు సాధారణమైన కార్‍ల వలె డోర్ ప్యాడ్‌లపై అమర్చబడి ఉన్నాయి.
ఫీచర్ల విషయాని కొస్తే, రాబోయే థార్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఎసి వెంట్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ తో లోడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము.
దాని పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, 2024 మహీంద్రా థార్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పవర్‍ని పొంది ఉంది. పెట్రోల్ మోటార్ 150bhp మరియు 320Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, ఆయిల్ బర్నర్ 130bhp మరియు 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
అనువాదించిన వారు: రాజపుష్ప