- బ్లాక్డ్-అవుట్ ఎలిమెంట్స్ తో కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందిన నయా మోడల్
- అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్ తో వచ్చిన 350h ఓవర్‌ట్రెయిల్
లెక్సస్ ఇండియా NX350h ఓవర్‌ట్రెయిల్ ఎడిషన్ ని రూ. 71.17 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. అత్యంత సౌకర్యవంతమైన మరియు లగ్జరీ వేరియంట్లలో ఈ మోడల్ రాగా, మొదటగా వచ్చిన మోడల్ తో పోలిస్తే మరింత స్టైలిష్ గా, మైనర్ అప్డేట్లతో, అదనపు ఫీచర్లతో వచ్చిన ఈ మోడల్ ధర రూ.3.82 లక్షలు ఎక్కువగా ఉంది. ఇది లెక్సస్ నుంచి వచ్చిన బేస్ మోడల్ మరియు టాప్ మోడల్ మధ్య సరిగ్గా సరిపోతుంది.
ఓవర్‌ట్రెయిల్ మోడల్ మూన్ డెజర్ట్ ఎక్స్‌టీరియర్ కలర్లో రాగా, కారులోని ఇతర ఎలిమెంట్స్ పై కాంట్రాస్టింగ్ కలర్ ని పొందింది. డోర్ హ్యండిల్స్ తో పాటుగా సిగ్నేచర్ స్పిండిల్ గ్రిల్, ఓఆర్‌విఎం, మరియు రూఫ్ రెయిల్స్ పై గ్లోస్ బ్లాక్ కలర్ ని కలిగి ఉంది. ఎఫ్-స్పోర్ట్ మరియు లగ్జరీ వేరియంట్లలో అందించిన 20-ఇంచ్ వీల్స్ లాగా కాకుండా ఇది చిన్న 18-ఇంచ్ వీల్స్ తో వచ్చింది.
ఇంటీరియర్ పరంగా, NX 350h ఓవర్‌ట్రెయిల్ మోడల్ క్యాబిన్ లోపల చూస్తే, ఇది పూర్తిగా బ్లాక్ కలర్ ఇంటీరియర్ థీమ్‌ను కలిగి ఉంది, ఇందులో ఉండే డోర్ ట్రిమ్‌లపై 'జియో లేయర్' ఇన్‌సర్ట్స్ బ్రౌన్ కలర్ యాక్సెంట్స్ లో ఉన్నాయి. అంతే కాకుండా, ఇది 17-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, కలర్డ్ హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా మరియు ఏడీఏఎస్(ఎడాస్) వంటి ఫీచర్లతో వచ్చింది.
బానెట్ కింద, NX350h మోడల్ 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ని కొనసాగిస్తుంది. కారు ఆల్-వీల్ డ్రైవ్ ఈ-సివిటి యూనిట్ ద్వారా నిర్వహించబడుతుండగా, ఇది 243bhp ని ఉత్పత్తి చేస్తుంది.
కొత్త వేరియంట్ రాకతో, లెక్సస్ NX350h మోడల్ ఆడి Q5, మెర్సిడెస్-బెంజ్ GLC, వోల్వో XC60, మరియు బిఎండబ్లూ X3 వంటి లగ్జరీ కార్లతో పోటీ పడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్