- ఫ్రంట్ మరియు రియర్ రియర్ వ్యూ కెమెరాలకు సంబంధించినఅంశమే రీకాల్ కి కారణం
- దేశవ్యాప్తంగా రీకాల్ చేయబడ్డ 113 యూనిట్ల LS, RX మరియు NX మోడల్స్
లెక్సస్ ఇండియా దేశవ్యాప్తంగా దాని LS, NX మరియు RX అనే మూడు మోడళ్ల ను స్వచ్ఛందంగా రీకాల్ చేయడం ప్రారంభించింది. వివిధ టైమ్‌లైన్స్ లో తయారు చేయబడిన మొత్తం 113 యూనిట్లపై ఈ రీకాల్ ప్రభావం చూపవచ్చు. అలాగే, ముఖ్యంగా, సమస్యకు గురైన భాగాలన్ని రీప్లేస్ మెంట్ ద్వారా కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా భర్తీ చేస్తుంది.
లెక్సస్ ఇండియా ప్రకారం, ఫ్రంట్ మరియు రియర్ వ్యూ కెమెరాలను తనిఖీ చేయడం మరియు వాటిని రీప్లేస్ చేయడమే లక్ష్యంగా రీకాల్ చేస్తున్నట్లు బ్రాండ్ పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు, ఈ సమస్యను ఎదుర్కొంటున్న కార్లకు సంబంధించి ఎటువంటి కేసులు నివేదించబడలేదు. అలాగే, సర్వీస్ క్యాంపెయిన్ లో భాగంగా ఈబ్రాండ్ ప్రతి కస్టమర్‌ను వారి వారి డీలర్‌షిప్‌ల ద్వారా సంప్రదిస్తుంది.
కంపెనీ (ఆటోమేకర్) ప్రకారం, 20 ఏప్రిల్, 2023 నుండి 9 ఆగస్టు, 2023 మధ్య తయారు చేయబడిన LS 500 మరియు LS500H కార్లు మరియు 17 జనవరి, 2023 నుండి 24 ఫిబ్రవరి 2023 వరకు తయారు చేయబడిన NX కార్లు రీకాల్ చేయబడ్డాయి. అదనంగా, 9 మే, 2023 మరియు 8 ఆగస్టు, 2023 మధ్య తయారు చేయబడిన RX యూనిట్లు కూడా ఇందులో భాగంగా రీకాల్ చేయబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప