- ఇండియాలో లెక్సస్ నుంచి వస్తున్న 5వ షోరూం ఇదే
- ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈఎస్ క్రాఫ్ట్స్ కలెక్షన్
విజయవాడలో కొత్త డీలర్ షోరూంని ప్రారంభించినట్లు లెక్సస్ ఇండియా ప్రకటించింది. సహజ సిద్ధంగా లైఫ్ స్టైల్ కి అనుగుణంగా తమదైన మార్క్ ఉండేలా 5వ షోరూంను లెక్సస్ విజయవాడలో ప్రారంభించగా, మిగతా షోరూంలు గుర్గావ్, కోయంబత్తూరు, పూణే మరియు కాలికట్ లో ఉన్నాయి.
స్థానికంగా ఉండే వాటితో అతిథులు కనెక్ట్ అయ్యేలా లెక్సస్ పర్యావరణానికి అనుకూలమైన కొండపల్లి బొమ్మలను, చేతితో తయారు చేయబడ్డ టకుమీ ఆర్ట్ ను ఇక్కడ ప్రదర్శించనుంది. 400 ఏళ్ళ నాటి సంప్రదాయం, కొండపల్లి బొమ్మలు మరియు ఈ ప్రాంతానికి సమీపంలో చెక్క బొమ్మలను తయారు చేసే ప్రత్యేకమైన తకుమీ ఆర్ట్ మరియు స్కిల్స్ లో ఇందులో ఒక భాగమని చెప్పవచ్చు.
లోకల్ ఇన్ స్పిరేషన్ తో పాటు, నూతన లెక్సస్ షోరూంలో లెక్సస్ కార్ల ప్రదర్శనతో పాటు అతిథుల కోసం కాఫీ లాంజ్ కూడా ఉంటుంది. దీనికి అదనంగా ఈఎస్ క్రాఫ్టెడ్ కలెక్షన్ కూడా షోరూంలో ప్రదర్శించబడుతుంది. ప్రస్తుతం ఇండియాలో లెక్సస్ ఇండియాకి సంబంధించి ES, LX, NX, LC 500h, RX, LS మరియు LM వంటి మోడల్స్ వాడుకలోఉన్నాయి.
ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ, “గొప్ప డిజైన్ మరియు నైపుణ్యం ద్వారా లెక్సస్ లగ్జరీని ప్రదర్శించే ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ స్పేస్‌ను ఇక్కడ ప్రారంభించడం పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము. విజయవాడలోని కొత్త మెరాకి-ఇంస్పైర్డ్ బ్రాండ్ స్పేస్, లెక్సస్ అతిథులకు కొత్తదనం మరియు అసాధారణమైన ఆతిథ్యాన్ని అందిస్తామన్న వాగ్దానానికి కట్టుబడి ఉన్నాం. ఈ విస్తరణ ద్వారా, మరింత మెరుగైన లగ్జరీ లైఫ్ స్టైల్ ని చేరుకుంటామని మేము బలంగా నమ్ముతున్నాము.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్