- ఇప్పటివరకు ఉన్న మోడల్స్ తో పోలిస్తే మోస్ట్ పవర్ ఫుల్ డిఫెండర్ మోడల్
- ఈ ఏడాది చివర్లో అరంగేట్రం అయ్యే అవకాశం
ల్యాండ్ రోవర్ తన డిఫెండర్ లైనప్, డిఫెండర్ ఆక్టా కొత్తగా మరింత పవర్ ఫుల్ ఇటరేషన్ ని ప్రకటించింది. దీనిని గతంలో ఎస్ విఎక్స్ అని పిలిచేవారు. ఇప్పుడు, ఈ కొత్త పేరు ఆక్టాహెడ్రాన్ డైమండ్ నుండి వచ్చింది , ఆక్టాహెడ్రాన్ డైమండ్ అంటే భూమిపై సహజంగా సంభవించే (లభించే) అత్యంత కఠినమైన ఖనిజంగా చెప్పబడుతుంది.
రాబోయే ఆఫ్-రోడర్ జెఎల్ఆర్ బ్యాడ్జ్‌ను పొందిన మొదటి మోడల్ మరియు డైమండ్-ఇంస్పైర్డ్ సిగ్నేచర్ గ్రాఫిక్‌తో సహా కొత్త విజువల్ ఓవర్హాల్లను కలిగి ఉంటుంది, ఇది భవిష్యత్తులో అన్ని ఫ్లాగ్షిప్ డిఫెండర్ మోడల్లను ప్రదర్శిస్తుంది.
బ్రిటిష్ కార్ మేకర్ దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించనప్పటికీ, డిఫెండర్ ఆక్టాలో మంచి పెర్ఫార్మెన్స్ అందించే వి8 టర్బో మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ మోటార్ ను అమర్చారు, ఇది ఎప్పటికీ మోస్ట్ పవర్ ఫుల్ డిఫెండర్‌గా ఉంటుంది.
ఇంకా, 6D డైనమిక్స్ ఎయిర్ సస్పెన్షన్ ఉండడంతో ఆక్టా ఎలాంటి రోడ్డుపై అయిన సరే బెటర్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప