- 110 వెర్షన్లో మాత్రమే లభిస్తున్న మోడల్
- ఈ సంవత్సరం చివరలో ప్రారంభంకానున్న వీటి డెలివరీ
ఇప్పటికి మోస్ట్ పవర్ ఫుల్ మరియు డిఫెండింగ్ లగ్జరీ కారుగా కొనసాగుతున్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా మొత్తానికి ధర ట్యాగ్ తో వచ్చేసింది. ఈ లగ్జరీ మోడల్ ఇండియాలో రూ. 2.65 కోట్ల ఎక్స్-షోరూం ధరతో అందించబడింది. అదే విధంగా, డిఫెండర్ ఆక్టా మోడల్ లోని ఒక ఎడిషన్ రూ. 2.85 కోట్ల ఎక్స్-షోరూం ప్రీమియం ధరతో అందుబాటులో ఉంది. అయితే, ఈ కొత్త డిఫెండర్ ఆక్టా బుకింగ్స్ ఈ నెలలో ప్రారంభంకానుండగా, వీటి డెలివరీ ఈ సంవత్సరం చివర నుంచి మొదలుకానున్నాయి.
డిఫెండర్ ఆక్టా మోడల్ కేవలం 110బాడీ స్టైల్ 4.4-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో హైబ్రిడ్ సహాయంతో అందించబడుతుంది. ఈ మోటార్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి, (డైనమిక్ లాంచ్ మోడ్ లో) 630bhp పవర్ మరియు 800Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కండీషన్లో, డిఫెండర్ ఆక్టా మోడల్ కేవలం నాలుగు సెకన్లలోనే జీరో (0) నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చాలా అందుకుంటుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గురించి తెలిస్తే మీరు వావ్ అనక తప్పదు. ఎందుకంటే ఇది గంటకు 250 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకెళ్తుంది.
కొత్త డిఫెండర్ ఆక్టా మోడల్ పూర్తి అడ్వాన్స్డ్ మరియు డైనమిక్ ఛాసిస్ తో వచ్చింది. ఈ ఆఫ్-రోడ్ మెషీన్ రేంజ్ రోవర్ ఎస్‍వీలో కనిపించిన విధంగా 6D డైనమిక్ సస్పెన్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ సిస్టం ఫిజికల్ యాంటీ-రోల్ బార్ అవసరం లేకుండా క్యాబిన్‌ను చాలా స్థిరంగా ఉంచుతుంది. అదనంగా, ఆక్టా కొత్త రైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లను, గరిష్టంగా 40 డిగ్రీల అప్రోచ్ యాంగిల్ మరియు 42 డిగ్రీల డిపార్చర్ యాంగిల్‌ను కలిగి ఉంది. ఇంకా, బ్రేక్‌ఓవర్ యాంగిల్ 29 డిగ్రీల వద్ద ఉంది.
కారు లోపలి భాగంలో, ఆక్టా పెర్ఫార్మెన్స్ సీట్లు మరియు ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది పెద్ద 11.4-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సెంటర్-కన్సోల్ ఫ్రిజ్, బాడీ మరియు సోల్ సీట్ ఆడియో టెక్ మరియు కొత్త బర్న్ట్ సియెన్నా సెమీ-అనిలిన్ లెదర్ సీట్లు స్టాండర్డ్‌గా అమర్చబడి ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్