- 4.0-లీటర్ V8 ఇంజిన్ తో వచ్చిన లగ్జరీ కారు
- 3.4 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగం దీని సొంతం
ఇండియాలో లంబోర్ఘిని మోడల్స్ లాంచ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. అయితే, అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ లగ్జరీ కార్ల సంస్థ లంబోర్ఘిని ఉరుస్ SE అనే కొత్త మోడల్ ని రూ.4.57 కోట్ల ఎక్స్-షోరూం ధరతో నేడే ఇండియాలో లాంచ్ చేసింది. లగ్జరీ కార్లను ఇష్టపడే వారికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
బానెట్ కింద, ఉరుస్ SE మోడల్ లోని 4.0-లీటర్ V8 ఇంజిన్ 25.7kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చింది. రెండింటితో కలిపి 789bhp కంబైండ్ పవర్ అవుట్ పుట్ ని జనరేట్ చేస్తుండగా, ఈ కారు కేవలం 3.4 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా అవలీలగా అందుకుంటుంది. ఉరుస్ SE కేవలం ఎలక్ట్రిక్ మోడ్ లో మాత్రమే 59కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
అంతే కాకుండా, ఉరుస్ SE కారు అప్ డేటెడ్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్ లైట్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్, మరియు రీడిజైన్డ్ 23-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని పొందింది. ఇంటీరియర్ పరంగా, ఉరుస్ SE కారు క్యాబిన్ కొత్త డ్యాష్ బోర్డు ప్యానెల్స్, కొత్త ఎయిర్ వెంట్స్ డిజైన్, మరియు లేటెస్ట్ ఇంటర్ఫేస్ (అనుసంధానంతో) మరియు ఆపరేటింగ్ సిస్టంతో భారీ 12.3-ఇంచ్ సెంటర్-స్టాక్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది.
ఇంకా, లంబోర్ఘిని ఉరుస్ SE లగ్జరీ కారుతో పోటీపడే కార్ల విషయానికి వస్తే, ఈ కారు ఆడి RSQ8, బెంట్లీ బెంటాయగా, మరియు మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ రేంజ్ వంటి కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్