- అవాంటడోర్ అప్ డేటెడ్ వెర్షన్ గా వచ్చిన ఈ సూపర్ కార్
- V12 హైబ్రిడ్ ఇంజన్, 1,015 bhp పవర్ దీని ప్రత్యేకత
లంబోర్ఘిని అధికారికంగా తన ఫ్లాగ్షిప్ స్పోర్ట్స్ కారు రెవోల్టోను రూ. 8.90 కోట్లు(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. దీన్ని లుక్స్, పెర్ఫార్మెన్స్, డిజైన్ చూస్తే మీ మతి పోతుంది. అయితే, అవాంటడోర్ యొక్క అప్ డేటెడ్ వెర్షన్ అయిన రెవోల్టో కొత్త V12 ఇంజిన్తో వచ్చింది, ఇప్పుడు దీనికి తోడుగా హైబ్రిడ్ మోటార్ కూడా జతచేయబడింది.
లంబోర్ఘిని రెవోల్టో టాప్ స్పీడ్ ఎంత!
రెవోల్టోలో మీరు 6.5-లీటర్, V12 పెట్రోల్ ఇంజన్ ను పొందుతారు, ఇది 825bhp పవర్ మరియు 725Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, దీనికిఒక హైబ్రిడ్ మోటార్ జత చేయబడింది, దీంతో కలిపిఇది 1,015bhp స్ట్రాంగ్ పవర్ ని ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా ఇది కొత్త 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడింది. ఇందులో ఆశ్చర్యపోయే అంశం ఏంటి అంటే, ఈ సూపర్ కారు కేవలం 2.5 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని చాలా సులభంగా అందుకుంటుంది. ఈ స్పోర్ట్స్ కారు టాప్ స్పీడ్ గంటకు 350 కి.మీ. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఈ కారు ఎంత ప్రత్యేకమైనదో అని.
రెవోల్టోలో డిజైన్ ఎలా ఉంది!
రెవోల్టోలో అన్ని చోట్లా వై-షేప్డ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి, ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి దీని లుక్స్ చూస్తే స్పేస్ షిప్స్ ద్వారా ఇంస్పైర్ అయి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ పూర్తి కొత్త లుక్స్ తో అదిరిపోయేలా ఉంది, అయితే డోర్స్ సిగ్నేచర్ సిజర్ స్టైల్లో ఉన్నాయి. అలాగే, ఇందులో 20 మరియు 21-ఇంచ్ వీల్స్ ఆప్షన్ కూడా ఉంది.
రెవోల్టోలో మీరు 3 స్క్రీన్లను పొందుతారు, ఇందులో 9.1-ఇంచ్ టచ్స్క్రీన్ సిస్టమ్, 12.3-ఇంచ్ డ్రైవర్ డిస్ప్లే మరియు ప్యాసింజర్స్ కోసం 9-ఇంచ్ స్క్రీన్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్