- గతంలో వచ్చిన యానివర్సరీ, ఆరాక్స్ ఎడిషన్ల వలె ఉండనున్న స్పెషల్ ఎడిషన్
- ప్రస్తుతం విక్రయించబడుతున్న మోడల్ కంటే అదనపు ఫీచర్లు మరియు కాస్మోటిక్ అప్ డేట్లతో రానున్న కొత్త ఎడిషన్
కియా దాని పోర్ట్ ఫోలియోలో ఉన్న వివిధ ప్రొడక్టులపై వర్క్ చేస్తుంది, వాటితో పాటుగా కొత్త లాంచ్ అయ్యే కార్లు లేదా ఇప్పటికే లాంచ్ అయిన ప్రొడక్టులను రీఫ్రెష్ చేస్తూ ఉంది. ఆటోమేకర్ కొత్త కార్నివాల్ మోడల్ లో మాత్రమే కాకుండా, EV9, మరియు కొత్త కాంపాక్ట్ ఎస్‍యూవీ వంటి కార్లలో కూడా స్పెషల్ ఎడిషన్ వెర్షన్లను తీసుకురానుంది.
ఇవన్నీ కూడా ఇండియాలో ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో లాంచ్ అవ్వడానికి షెడ్యూల్ చేయబడ్డాయి. కొన్ని సెలెక్ట్ మోడల్స్ లో స్పెషల్ ఎడిషన్ వెర్షన్లు రానుండగా, అందులో సెల్టోస్, కారెన్స్, మరియు సోనెట్ వంటి మోడల్స్ ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సోనెట్ మరియు సెల్టోస్ కార్లలో కొత్తగా GT లైన్ వేరియంట్లు అదనంగా చేరాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్స్ ఇటరేషన్లతో పోలిస్తే, కొత్త కియా స్పెషల్ ఎడిషన్లు ఎక్స్‌టీరియర్ డిజైన్లో చిన్నపాటి మార్పులు, ఇంకా ఇంటీరియర్లో మార్పులతో పాటుగా అదనపు ఫీచర్లతో రానున్నాయి. వీటి గురించి ఇంకా చెప్పాలంటే, గతంలో యానివర్సరీ, ఆరాక్స్ ఎడిషన్ కార్లలో మనం చూసిన ఫీచర్లు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్లలో కూడా వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్