- సెలెక్టెడ్ వేరియంట్ల ధరలలో మార్పులు
- రూ. 7.99 లక్షల నుండి మోడల్ ధరలు ప్రారంభం
కియా ఇండియా కొత్త గ్రావిటీ ఎడిషన్లను ప్రారంభించిన నేపథ్యంలో దాని రేంజ్ లోని సెలెక్ట్ చేసిన మోడల్లపై, ఇప్పుడు సెల్టోస్తో పాటు సోనెట్ ధరలలో కూడా మార్పులు చేసింది. ధరలలో మార్పులను తక్షణం అమల్లోకి తెచ్చింది.
సోనెట్ GTX+ 1.0 టర్బో-పెట్రోల్ డిసిటి వెర్షన్ పైరూ.11,000 వరకు ధర తగ్గింది. అదే విధంగా, ఇందులో HTE(O) 1.2 పెట్రోల్ ఎంటి, HTK 1.2 పెట్రోల్ ఎంటి, HTK 1.0 టర్బో-పెట్రోల్ ఐఎంటి మరియు HTK+ 1.0 టర్బో-పెట్రోల్ ఐఎంటి వెర్షన్లపై రూ.3,000 వరకు ధర తగ్గింది.
ఇప్పుడు అవుట్గోయింగ్ ధరల కంటే కియా సోనెట్ HTX 1.0 టర్బో-పెట్రోల్ డిసిటి మరియు HTK(O) 1.2 పెట్రోల్ ఎంటి అనే రెండు వెర్షన్ల ధరలు రూ. 2,000 తక్కువగా ఉంది. చివరగా, ఇందులో GTX 1.0 టర్బో-పెట్రోల్ డిసిటి మరియు GTX+ 1.0 టర్బో-పెట్రోల్ డిసిటి డ్యూయల్-టోన్ వెర్షన్లు రూ.1,000 ధర వరకు తగ్గింది.
సోనెట్ ధరలు తగ్గించబడినప్పటికీ, కియా సెల్టోస్, మిడ్-సైజ్ ఎస్యువి రూ. 8,000 వరకు ధర పెరిగింది. ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ న్యూ-జెన్ కార్నివాల్ మరియు EV9లను వచ్చే నెల ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప