- మొత్తం సేల్స్ లో 42 శాతంగా ఉన్న సోనెట్ సేల్స్
- 9.8 శాతం వార్షిక వృద్ధిని సాధించిన కొరియన్ బ్రాండ్
సౌత్ కొరియన్ కార్ల కంపెనీ కియా ఇండియా జూన్ నెలకు సంబంధించి దాని సేల్స్ రిపోర్టును వెల్లడించగా, అందులో కియా 21,300 యూనిట్లను విక్రయించి జూన్ నెల సేల్స్ ఛార్టులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది. గత సంవత్సరంలో విక్రయించిన 19,391 యూనిట్లతో పోలిస్తే, ఈ సంవత్సరం కియా 9.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. అయితే ఇక్కడ సేల్స్ లో సోనెట్ కారు కీలకంగా మారి, 2024 ప్రథమార్థంలో విక్రయించిన మొత్తం సేల్స్ లో 42 శాతం వాటాను కలిగి ఉండి, ఇండియాలో కొరియన్ ఆటోమేకర్ నుంచి బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచింది. తద్వారా 2024లోనిమొదటి ఆరు నెలల్లో సెల్టోస్ కంటే ఎక్కువగా సోనెట్ కార్లను కియా కంపెనీ విక్రయించింది.
అదే విధంగా, సోనెట్ 2024 ప్రథమార్థంలో సేల్స్ పరంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతుండగా, సెల్టోస్ మరియు కారెన్స్ కార్లు వరుసగా 32 మరియు 25 శాతం సేల్స్ తో దాని తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆటోమేకర్ 2024 ప్రథమార్థంలో 1.26 లక్షల యూనిట్ల విక్రయాలను రిజిస్టర్ చేసింది. ఇంకా చెప్పాలంటే, కొరియన్ బ్రాండ్ ఇదే సమయంలో 12,026 కార్లను విదేశాలను ఎగుమతి చేసింది.
సేల్స్ పెర్ఫార్మెన్స్ పై కియాసీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ హెడ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ, “2024లోని ప్రథమార్థంలో కియా కంపెనీ నెలకు సగటున 21,000 యూనిట్లకు పైగా విక్రయించి, మెరుగైన వృద్ధిని సాధించినట్లు మేము గమనించాము. కస్టమర్లను ఏడాది పొడవునా మా షోరూమ్‌లకు వచ్చేలా మా బెస్ట్ ప్రొడక్ట్స్ వారిని ఆకర్షిస్తున్నాయి, స్ట్రాంగ్ సేల్స్ తో మార్కెట్లో బెస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాము” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్