- కేవలం రూ.10 లక్షలలోపు ధరతో కొత్త టర్బో-పెట్రోల్ వేరియంట్ ని పొందిన సోనెట్
- 6 ఏటీ (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) మరియు 7డిసిటి వెర్షన్‌లలో లాంచ్ అయిన GTX వేరియంట్
కియా ఇండియా ఇండియన్ మార్కెట్ లో సోనెట్ లో మూడు కొత్త వెర్షన్‌లను అధికారికంగా లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 9.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యాయి. మేము ఇంతకు ముందు నివేదించినట్లుగా, సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి కొత్త GTX వేరియంట్‌ను పొందగా, ఇప్పుడు ఆటోమేకర్ కొత్త HTK టర్బో-పెట్రోల్ వెర్షన్‌ను కూడా తీసుకువస్తున్నట్లు నిర్ధారించింది.
GTX వేరియంట్‌తో ప్రారంభిస్తే, సెల్టోస్ లోని ఈ కొత్త ఇటరేషన్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, ప్యాడిల్ షిఫ్టర్స్, లెథెరెట్ సీట్స్, డ్రైవ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ మరియు ఆటో అప్/డౌన్ సేఫ్టీ విండో ఫంక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
1.0-లీటర్ టర్బో-పెట్రోల్ వెర్షన్ ఇప్పుడు కొత్త HTK వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీనిని రూ. 9.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. అలాగే, 118bhp మరియు 172Nm టార్క్ ఉత్పత్తి చేసే ఈ మోటార్, 6-స్పీడ్ ఐఎంటి గేర్‌బాక్స్ తో మాత్రమే జతచేయబడి (ముందు) ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
ముఖ్యంగా, HTE, HTE (O), మరియు HTK వంటి వాటితో కలిపి సోనెట్ లోని అన్ని వేరియంట్‌లు కూడా చిన్న చిన్న ఫీచర్ మార్పులను పొందాయి, ఇప్పుడు ఇవన్నీ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్ పాయింట్‌లను కూడా పొందాయి. అదే విధంగా వాటితో పాటు, HTK (O) వేరియంట్ రియర్ వైపర్ మరియు వాషర్‌నుపొందింది.
ఇంకా తర్వాత కొత్త కియా సోనెట్ HTK+ వేరియంట్ గురించి చెప్పాలంటే, ఇది ఇప్పుడు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రియర్ వైపర్ మరియు వాషర్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్‌లను కలిగి ఉంది. అదే విధంగా, టాటా నెక్సాన్ కి పోటీగా ఉన్న HTX వేరియంట్ కూడా ఇప్పుడు వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, 16-ఇంచ్ డైమండ్--కట్ అల్లాయ్ వీల్స్ మరియు రియర్ వైపర్ మరియు వాషర్‌ను కలిగి ఉంది.
సోనెట్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్‌లతో అందుబాటులో ఉంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ ఐఎంటి యూనిట్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ వంటివి ఉన్నాయి.
వేరియంట్ వారీగా కొత్త కియా సోనెట్ వేరియంట్స్ (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ధర |
సోనెట్ HTK | 1.0 టిజిడిఐ | ఐఎంటి | రూ. 9.60 లక్షలు |
సోనెట్ GTX | 1.0 టిజిడిఐ జిటిఎక్స్ | 7డిసిటి | రూ. 13.71 లక్షలు |
సోనెట్ | 1.5 సిఆర్‌డి ఐజిటిఎక్స్ | 6ఏటీ | రూ. 14.56 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప