- సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటుగా మరెన్నో ఫీచర్లను పొందిన కొత్త వేరియంట్
- పెట్రోల్ మరియు డీజిల్ రెండింట్లో లభ్యం
ఇటీవల మేము సోనెట్ ఎస్యూవీ రాబోయే (అప్‌కమింగ్) వేరియంట్ల గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని మీకు అందించాము. ఇప్పుడు HTE (O) మరియు HTK (O)అనే ఈ కొత్త వేరియంట్లుదేశవ్యాప్తంగా డీలర్షిప్స్ చేరుకోవడం ప్రారంభమైంది. వీటి ధరలు రూ.8.19 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమయ్యాయి.
కియా సోనెట్ తాజాగా పెట్రోల్ మాన్యువల్ మరియు డీజిల్ మాన్యువల్ రూపంలో HTE (O) మరియు HTK (O) అనే రెండు కొత్త వేరియంట్లను పొందింది. దీంతో, కియా సోనెట్‌ను ఇప్పుడు HTE, HTE (O), HTK, HTK (O), HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే తొమ్మిది వేరియంట్లలో పొందవచ్చు.
ఇప్పుడు, అప్డేట్ ప్యాకేజీలో భాగంగా HTK (O)వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌రూఫ్, కనెక్టెడ్ ఎల్ఈడీటెయిల్ల్యాంప్స్, రియర్ డీఫాగర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి కొన్ని ఫీచర్లను పొందింది.
మెకానికల్ గా, కియా సోనెట్ 1.2-లీటర్ ఎన్ఎపెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో వచ్చింది. పైన తెలిపిన ఈ మోటార్లను కస్టమర్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిసిటియూనిట్ వంటి వివిధ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కస్టమైజ్ చేసి పొందవచ్చు.
కొత్త వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:
కొత్త వేరియంట్లు | ధరలు |
HTE (O) పెట్రోల్ | రూ. 8.19 లక్షలు |
HTK (O) పెట్రోల్ | రూ. 9.25 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్