- కొత్త అరోరా బ్లాక్ పెర్ల్ కలర్ ని పొందిన X-లైన్ వేరియంట్
- సోనెట్ తో పాటుగా ఈ కొత్త GTX వేరియంట్ ని పొందిన కియా సెల్టోస్
కియా ఇండియా దాని టాప్-సెల్లింగ్ మోడల్స్ అయిన సెల్టోస్ మరియు సోనెట్ మోడల్స్ వేరియంట్లలో మార్పులు చేసింది. దీంతో, ఈ రెండు మోడల్స్ కొత్త వేరియంట్ ని మరియు కొత్త కలర్ ఆప్షన్ ని పొందాయి. సోనెట్ ఎస్‍యూవీ కొత్త GTX వేరియంట్ ని పొందగా, ధర మరియు ఫీచర్ల పరంగా ఈ కొత్త వేరియంట్ HTX+ మరియు GTX+ వేరియంట్ల మధ్య పొజిషన్ చేయబడింది. కియా కంపెనీ సోనెట్ మోడల్ లోని ఈ కొత్త వేరియంట్ ని రూ.13.71 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
సోనెట్ GTX వేరియంట్ చాలా ఫీచర్లతో వచ్చింది. అందులో బ్లైండ్ స్పాట్ మానిటర్ తో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
కలర్ ఆప్షన్ల పరంగా చూస్తే, సోనెట్ GTX వేరియంట్ ని స్పార్క్లింగ్ సిల్వర్, ప్యూటర్ ఆలివ్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ మరియు గ్లేసియర్ వైట్ పెర్ల్ అనే ఏడు కలర్లలో పొందవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇంతకు ముందు X-లైన్ వేరియంట్ మ్యాట్ గ్రాఫైట్ కలర్ తో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఈ X-లైన్ వేరియంట్ కొత్త అరోరా బ్లాక్ పెర్ల్ కలర్ తో కూడా అందుబాటులోకి వచ్చింది.
మెకానికల్ గా, సోనెట్ GTX వేరియంట్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. ఈ కారులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి రాగా, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జతచేయబడి వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్