- పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభ్యం
- ప్లాన్ అప్ గ్రేడ్ లో భాగంగా కియా సోనెట్ లో వచ్చిన కొత్త గ్రావిటీ వేరియంట్
కియా కంపెనీ దాని పూర్తి రేంజ్ మోడల్స్ లోస్పెషల్ ఎడిషన్లను తీసుకువస్తుందని ఇంతకు ముందే మేము మీకు ఎక్స్‌క్లూజివ్ గా చెప్పాము. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. కియాలో అతి చిన్న కారుగా పిలువబడుతున్న సోనెట్ మోడల్ లో గ్రావిటీ వేరియంట్ ని కియా తీసుకువచ్చింది. ఈ వేరియంట్ HTK+ వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది. సోనెట్ కారులోని లోయర్-స్పెక్ వెర్షన్లో స్పెషల్ ఎడిషన్ ని మొదటిసారిగా కియా కంపెనీ తీసుకువచ్చింది. నిజానికి, లోయర్ స్పెక్ వెర్షన్ లో GT-లైన్ వేరియంట్ ని కియా కంపెనీ త్వరలో పరిచయం చేయనుంది.
గ్రావిటీ ప్యాకేజీలో భాగంగా, సోనెట్ గ్రావిటీ వేరియంట్ కారు వైట్ బ్రేక్ కాలిపర్స్, నేవీ స్టిచింగ్‌తో ఇండిగో పెరా సీట్లు, లెదర్ గేర్ నాబ్, స్పాయిలర్ మరియు R16 అల్లాయ్ వీల్స్ ని పొందింది. అలాగే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డాష్ క్యామ్, ఫ్రంట్ డోర్ ఆర్మ్‌రెస్ట్, 60:40 స్ప్లిట్ సీట్లు, రియర్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్, కప్ హోల్డర్‌లతో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ మరియు కారుకు ఇరువైపులా గ్రావిటీ ఎంబ్లెమ్ (చిహ్నం) వంటి అదనపు ఫీచర్లను గ్రావిటీ వేరియంట్ పొందింది.
గ్రావిటీ వేరియంట్ ని సోనెట్ లోని మూడు ఇంజిన్ ఆప్షన్లతో పొందవచ్చు. అందులోని 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-డీజిల్ ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ని పొందగా, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో అందించబడింది. ఇంకా చెప్పాలంటే సోనెట్ గ్రావిటీ మోడల్ ని ఎడిషన్ పెర్ల్ వైట్, అరోరా బ్లాక్ పెర్ల్, మరియు మ్యాట్ గ్రాఫైట్ వంటి కలర్ల నుంచి కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు.
కియా సోనెట్ గ్రావిటీ వేరియంట్ ధరలు కింది విధంగా ఉన్నాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
కియా సోనెట్ గ్రావిటీ 1.2 ఎంటి | రూ.10.49 లక్షలు |
కియా సోనెట్ గ్రావిటీ 1.0 ఐఎంటి | రూ.11.19 లక్షలు |
కియా సోనెట్ గ్రావిటీ 1.5 డీజిల్ ఎంటి | రూ.11.99 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్