- 20 డిసెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న బుకింగ్స్
- 11 కలర్ ఆప్షన్స్ మరియు 7 వేరియంట్స్ లో లభ్యంకానున్న 2024 సోనెట్
నిన్న, మేము ప్రత్యేకంగా 2024 కియా సోనెట్ ను అధికారికంగా ఆవిష్కరించడానికి ముందే దీనికి సంబంధించిన బుకింగ్ వివరాలను మీకు అందించాము. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ మొత్తానికి దేశం అంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5-సీట్ ఎస్‍యూవీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. హ్యుందాయ్ వెన్యూ-పోటీగా ఉన్న ఇది 2020లో లాంచ్ అయిన తర్వాత ఇదే మొట్టమొదటి ప్రధాన అప్ డేట్ అని చెప్పవచ్చు. అయితే,దీని బుకింగ్స్ 20 డిసెంబర్, 2023న ప్రారంభంకానున్నాయి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 7 వేరియంట్స్ లో అందించబడుతుంది. అవి ఏవి అంటే HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ వేరియంట్స్. అలాగే ఇది అన్నీ వేరియంట్స్ లో 11 కలర్స్ లో అందుబాటులోకి వచ్చింది. కలర్స్ విషయానికి వస్తే, గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, క్లియర్ వైట్, ప్యూటర్ ఆలివ్ మరియు మ్యాట్ గ్రాఫైట్ షేడ్ అనే మోనోటోన్ కలర్స్ ఉన్నాయి. మరోవైపు డ్యూయల్-టోన్ కలర్స్ లో బ్లాక్ రూఫ్ తో ఇంటెన్స్ రెడ్ మరియు గ్లేసియర్ వైట్ పెర్ల్ ఉన్నాయి.
2024 సోనెట్ లో ఇన్‌వర్టెడ్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా, తాజాగా డిజైన్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు టెయిల్‌గేట్ పొడవునా వెనుకవైపు లైట్ బార్ ఉన్నాయి. లోపల చూస్తే, ఇంటీరియర్ పరంగా క్యాబిన్‌లో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెవెల్-1 ఏడీఏఎస్(అడాస్) సూట్, కొత్త ఎయిర్‌కాన్ ప్యానెల్, వాయిస్-కంట్రోల్డ్ విండో ఫంక్షన్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి హైలెట్ ఫీచర్స్ ఉన్నాయి.
మెకానికల్ గా, కొత్త కియా సోనెట్ ఇంతకు ముందున్న మూడు ఇంజిన్‌లతో ఇప్పుడు కూడా లాంచ్ అయింది. ఇందులోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్82bhp మరియు 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులోని 1.5-లీటర్ డీజిల్ మిల్, 114bhp మరియు 250Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, అదే విధంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ 118bhp మరియు 172Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను5-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ ఐఎంటి యూనిట్ మరియు 6-స్పీడ్ ఐఎంటి, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ నిర్వహించనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్