- 14 డిసెంబర్, 2023న అరంగేట్రం చేయనున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్
- రీడిజైన్ చేయబడిన సోనెట్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్
దేశవ్యాప్తంగా ఉన్న డీలర్స్ ఇండియాలో కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క అనధికారిక బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించారు. ఈ మోడల్ 14 డిసెంబర్, 2023న ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎవరైనా ఈ అప్ డేటెడ్ ఎస్‍యూవీని బుక్ చేసుకోవాలనుకుంటే వారు రూ.20,000 నుండి రూ. 25,000 వరకు టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు.
ఇందులో కొత్తగా చోటు చేసుకున్న మార్పుల గురించి చెప్పాలంటే, రాబోయే కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ తో రానుంది. ఇక ఎక్స్‌టీరియర్ హైలెట్స్ లో కొత్త ఇన్వర్టెడ్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్తగా మరియు స్లిమ్ గా కనిపించే ప్యాటర్న్ గ్రిల్, క్యూబ్- షేప్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బంపర్-మౌంటెడ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, మరియు కనెక్టెడ్ టెయిల్ లైట్ సెటప్ ఉన్నాయి.
ఇంటీరియర్ లో ఉన్న మార్పులను పరిశీలిస్తే, అప్ డేటెడ్ సోనెట్ ఎస్‍యూవీలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, బోస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు లెవెల్-1 ఏడీఏఎస్ సూట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇందులో మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, కొత్త సోనెట్ లో 1.2-లీటర్ ఎన్ఎపెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటుగా అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ను కొనసాగించనుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ కూడా ప్రస్తుత మోడల్ నుండి తీసుకోబడ్డాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్