- ఇప్పటికే బ్రోచర్ ద్వారా లీకైన సోనెట్ ఫేస్‍లిఫ్ట్ వివరాలు
- 10 కలర్స్ మరియు 7 వేరియంట్స్ లో లభించే అవకాశం
కియా ఇండియా-స్పెక్ సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో దాని ధరను ప్రకటించాల్సి ఉండగా, దాని కంటే ముందే ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది. అప్ డేటెడ్ మోడల్ ఇప్పటికే అనేక సార్లు ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది మరియు ముఖ్యమైన విషయం ఏంటి అంటే లీకైన బ్రోచర్ ద్వారా కీలక వివరాలు కూడా వెల్లడయ్యాయి.
క్రింది హుడ్ లో వివరాలను చూస్తే , 2024 కియా సోనెట్ ఇంతకు ముందున్న1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్,1.5-లీటర్ డీజిల్ మిల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్స్ తో రానుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇవి 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ ఐఎంటి యూనిట్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో కలిపిఉన్నాయి.
డిజైన్ పరంగా చూస్తే, కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రివైజ్డ్ హెడ్ ల్యాంప్ మరియు డీఆర్ఎల్ డిజైన్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, బూట్ లిడ్ పై ఎల్ఈడీ లైట్ బార్, వర్టికల్ గా అమర్చబడిన ఎల్ఈడీ టెయిల్ లైట్స్, కొత్త ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, మరియు కొత్త అల్లాయ్ వీల్స్ సెట్ ను పొందనుంది.
లోపల ఉన్న ఫీచర్స్ పరంగా చూస్తే, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో లెవెల్-1 ఏడీఏఎస్ సూట్, 4-వే పవర్డ్ డ్రైవర్స్ సీట్, 360-డిగ్రీ కెమెరా, కొత్త ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాగే, ఇది వరకే ఇందులో 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు బోస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్