- 14డిసెంబర్, 2023లో ఆవిష్కరణ
- లెవెల్-1 ఏడీఏఎస్ తో వస్తున్నట్లు నిర్ధారణ
కియా ఇండియా తన రాబోయే ఎస్‌యువి సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని మళ్లీ టీజ్ చేసింది. ఈ సమయంలో, ఆటోమేకర్ సంస్థ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు దాని రియర్ ప్రొఫైల్‌ను ప్రదర్శించింది.
టీజర్ లో చూసినట్లుగా, అప్‌డేటెడ్ సోనెట్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందింది, ఇది ప్రస్తుతం కొత్త సెల్టోస్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, హ్యుందాయ్ వెన్యూతో పోటీగా కొనసాగే ఇందులో లెవెల్-వంటి ఫీచర్లు ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో చూస్తే, ఎస్‌యువి కొత్తగా రూపొందించిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లను మరియు టెయిల్‌గేట్ వెడల్పులో ఎల్ఈడీ బార్‌ను కలిగి ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే, కొత్త సెల్టోస్ వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు 360-డిగ్రీ కెమెరాతో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో లోడ్ చేయబడింది.
క్రింది హుడ్ లో, ఫేస్‌లిఫ్టెడ్ సోనెట్ దాని ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్ లనే మళ్ళీ పొందే అవకాశం ఉంది. దీనిని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పొందవచ్చు. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి మరియు 7-స్పీడ్ డిఎస్‍జి యూనిట్ ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప