- ఇండియాలో రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభంకానున్న కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధరలు
- వెంటిలేటెడ్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా మరియు లెవల్-1 ఏడీఏఎస్ వంటి ఫీచర్లతో లభ్యం
గత వారం, కియా ఇండియా 2024 సోనెట్‌ను దేశం అంతటా రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. 2020లో లాంచ్ అయిన తర్వాత ఈ సబ్-ఫోర్-మీటర్ SUV ఇది మొదటి సారిగా భారీ అప్‌డేట్ లను పొందింది. ప్రస్తుతం ఇది HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే 7 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ఈ SUV ఇప్పుడు లెవల్-1 ఏడీఏఎస్(అడాస్) సేఫ్టీ సూట్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు మరియు 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటిస్పోర్ట్స్ ఫీచర్లను పొందింది.
ఇండియాలోని టాప్ 10 నగరాల్లో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
సిటీ | బేస్ మోడల్ | టాప్ మోడల్ |
ముంబై | రూ. 9.39లక్షలు | రూ.18.95లక్షలు |
ఢిల్లీ | రూ. 9.09లక్షలు | రూ.18.71లక్షలు |
చెన్నై | రూ. 9.55లక్షలు | రూ.19.54లక్షలు |
కోల్‌కతా | రూ. 9.29లక్షలు | రూ.18.27లక్షలు |
బెంగళూరు | రూ.9.54లక్షలు | రూ.19.38లక్షలు |
హైదరాబాద్ | రూ.9.61లక్షలు | రూ.19.37లక్షలు |
అహ్మదాబాద్ | రూ.8.87లక్షలు | రూ.17.42లక్షలు |
పూణే | రూ. 9.39లక్షలు | రూ.18.95లక్షలు |
చండీగఢ్ | రూ. 8.86 లక్షలు | రూ.17.41లక్షలు |
కొచ్చి | రూ. 9.52 లక్షలు | రూ.19.36లక్షలు |
పవర్‌ట్రెయిన్‌ల విషయానికొస్తే, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. దీనిని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో పొందవచ్చు. ఈ మోటార్లను 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఐఎంటిమరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయవచ్చు.
ఈ హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడుతున్న దీనిని కస్టమర్‌లు 9 మోనోటోన్‌లు మరియు రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ లో ఎంచుకోవచ్చు. మోనోటోన్ షేడ్స్‌లో అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, స్పార్క్లింగ్ సిల్వర్, ఇంపీరియల్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, గ్రావిటీ గ్రే, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్ మరియు మ్యాట్ గ్రాఫైట్ ఉన్నాయి. మరోవైపు, డ్యూయల్ టోన్‌లలో గ్లేసియర్ వైట్ పెర్ల్ మరియు బ్లాక్ రూఫ్‌తో కూడిన ఇంటెన్స్ రెడ్ కూడా ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప