- మరికొన్ని వారాల్లో సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ధరలు వెల్లడి
- 3 పవర్ ట్రెయిన్స్ తో అందుబాటులోకి రానున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్
మరికొన్ని వారాల్లో 2024 సోనెట్ యొక్క లాంచ్ జరగనుండగా, దానికంటే ముందుగా కియా ఇండియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క మైలేజీని వెల్లడించింది. గత నెలలో సబ్-4-మీటర్ ఎస్‍యూవీ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ ఆవిష్కరణ జరగగా, ప్రస్తుతం దీనిని కేవలం రూ. 25,000 బుకింగ్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు.
కొత్త కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ 3 పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో కస్టమర్లకు అందించబడుతుంది. లాంచ్ సమయానికి సోనెట్ ఫేస్‍లిఫ్ట్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే జత చేయబడి, అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్లతో రానుంది. అదే విధంగా, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి, మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ గేర్ బాక్స్ ఆప్షన్లతో రానుంది. అయితే వీటికి సంబంధించి వెర్షన్-వారీగా మైలేజీ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
సోనెట్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ | మైలేజీ |
1.2-లీటర్ పెట్రోల్ 5ఎంటి | 18.83కెఎంపిఎల్ |
1.0-లీటర్ పెట్రోల్ 6ఎంటి | 18.70కెఎంపిఎల్ |
1.0-లీటర్ పెట్రోల్ 7డిసిటి | 19.20కెఎంపిఎల్ |
1.5-లీటర్ డీజిల్ 6ఐఎంటి | 22.30కెఎంపిఎల్ |
1.5-లీటర్ డీజిల్ 6ఎంటి | టిబిఎ |
1.5-లీటర్ డీజిల్ 6ఎటి | 18.60కెఎంపిఎల్ |
ఇక రాబోయే సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో మార్పుల విషయానికి వస్తే, ఇంతకు ముందున్న దానితో పోలిస్తే ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, లేటెస్ట్ 16-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీలైట్ బార్ మరియు ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ ఉండనున్నాయి. లోపల ఇంటీరియర్ పరంగా, సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో లెవెల్-1ఏడీఏఎస్(అడాస్), 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు రియర్ డోర్ సన్‌షేడ్ కర్టెన్స్ ఉండనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్