- పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్స్ లో మొత్తం 7 వేరియంట్లలో లభ్యం
- లెవెల్-1 ఏడీఏఎస్(అడాస్)తో 10 సేఫ్టీ ఫంక్షన్స్ దీని ప్రత్యేకత
డిసెంబర్ 2023లో ఆవిష్కరించబడగా, మొత్తానికి కియా ఇండియా కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ఇండియాలో రూ.7.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడుతున్న ఈ కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ మొత్తం 11 కలర్స్ లో, HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, మరియు X-లైన్ అనే 7 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
కొత్త అప్‍డేట్స్ పరంగా చెప్పాలంటే కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ కొత్త గ్రిల్ తో రివైజ్డ్ ఫాసియా, ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ఫ్రెష్ గా కనిపించే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ-కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్ మరియు ఒక జత 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ను పొందింది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో కూడిన కొత్త 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్ ను తీసుకున్నట్లు అనిపించే డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రీడిజైన్డ్ ఎయిర్‌కాన్ ప్యానెల్, సరౌండ్ వ్యూ మానిటర్ మరియు 10 సేఫ్టీ ఫంక్షన్‌లను కలిగి ఉన్న లెవెల్-1 ఏడీఏఎస్(అడాస్)సూట్ కలిగి ఉంది.
ఇక ఇంజిన్స్ విషయానికి వస్తే, సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో ఇంతకు ముందు ఉన్న పవర్ ట్రెయిన్స్ ఇందులో ఉన్నాయి. కొత్త సోనెట్ ఫేస్‍లిఫ్ట్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతోంది. కస్టమర్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఐఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్లను కాన్ఫిగర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, కియా కంపెనీ ఏ ఇంజిన్ ఎంత మైలేజీ ఇస్తుందో వాటి వివరాలను కూడా వెల్లడించింది.
వేరియంట్-వారీగా కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క ఎక్స్-షోరూం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
1.2- లీటర్ ఎన్ఎ పెట్రోల్ | 5 ఎంటి | HTE | రూ. 7.99 లక్షలు |
HTK | రూ. 8.79 లక్షలు | ||
HTK+ | రూ. 9.90 లక్షలు | ||
1.0- లీటర్ టర్బో-పెట్రోల్ | ఐఎంటి | HTK+ | రూ. 10.49 లక్షలు |
HTX | రూ. 11.49 లక్షలు | ||
HTX+ | రూ. 13.39 లక్షలు | ||
7 డిసిటి | HTX | రూ. 12.29 లక్షలు | |
GTX+ | రూ. 14.50 లక్షలు | ||
X-లైన్ | రూ. 14.69 లక్షలు | ||
1.5-లీటర్ డీజిల్ | 6 ఎంటి | HTE | రూ. 9.79 లక్షలు |
HTK | రూ. 10.39 లక్షలు | ||
HTK+ | రూ. 11.39 లక్షలు | ||
HTX | రూ. 11.99 లక్షలు | ||
HTX+ | రూ. 13.69 లక్షలు | ||
6 ఐఎంటి | HTX | రూ. 12.60 లక్షలు | |
HTX+ | రూ. 14.39 లక్షలు | ||
6 ఎటి | HTX | రూ. 12.99 లక్షలు | |
GTX+ | రూ. 15.50 లక్షలు | ||
X-లైన్ | రూ. 15.69 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్