- ఇండియాలో 2023 చివరి నాటికి లాంచ్ అవ్వనున్న సోనెట్ ఫేస్‌లిఫ్ట్
- న్యూ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రానున్న సోనెట్
ఫేస్‌లిఫ్టెడ్ కియా సోనెట్ లాంచ్‌కు ముందు మరోసారి టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది. క్యాలెండర్ ఇయర్ చివరిలో ఫేస్‌లిఫ్టెడ్ కియా సోనెట్ లాంచ్ కానుంది. వీటికి సంబంధించిన న్యూ స్పై ఫోటోలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. రిఫ్రెష్ చేయబడిన సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీ మోడల్ కి సంబంధించిన ఒక యూనిట్ ఇంటీరియర్ పార్ట్స్ ను ఇక్కడ మనం చూడవచ్చు.
ఇక్కడ ఉన్నఫోటోలలో చూసినట్లుగా, న్యూ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సెల్టోస్-ఇన్ స్పైర్డ్ ఎల్ఈడి టైల్‌లైట్స్ మరియు న్యూ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ తో కూడిన అప్‌డేటెడ్ ఎక్స్ టీరియర్ ను పొందింది. మిగిలిన చోట్లముందు మరియు వెనుక బంపర్స్, రూఫ్ రెయిల్స్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నాతో రాబోతుంది.
లోపలి భాగంలో, 2024 కియా సోనెట్ లోఏసీ కంట్రోల్స్ కోసం న్యూ సెటప్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండవ-వరుసలో ఉండేవారి కోసం బిల్ట్-ఇన్ సన్ బ్లైండ్స్, డ్యూయల్-టోన్ టాన్ మరియు బ్లాక్ అప్హోల్స్టరీ, మరియు ఒక రీవర్క్డ్ సెంటర్ కన్సోల్ వెనుక ఆర్మ్‌రెస్ట్ కోసం కప్ హోల్డర్స్ ఉన్నాయి. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
రాబోయే సోనెట్ ఫేస్‌లిఫ్ట్ అవుట్‌గోయింగ్ వెర్షన్ వలె అదే సెట్ ఇంజిన్స్ నుండి పవర్ ని పొందుతుందని మేము ఆశిస్తున్నాము. వీటిలో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్, 1.5-లీటర్ డీజిల్ మిల్లు మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి.ఈ మోడల్ ధరలు డిసెంబర్ 2023లో ప్రకటించబడతాయి.
అనువాదించిన వారు:రాజపుష్ప