- 3 ఇంజిన్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్
- సెల్టోస్ ప్యాలెట్ నుంచి తీసుకోబడ్డ పీటర్ ఆలివ్ కలర్
డిసెంబర్ 14న ఆవిష్కరణకు సర్వం సిద్ధం కాగా, దానికి కొన్ని రోజుల ముందు కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క బ్రోచర్ ఇంటర్నెట్లో లీకై చక్కర్లు కొడుతుంది. అప్ డేటెడ్ బ్రోచర్ ద్వారా రాబోయే సబ్-4 మీటర్ ఎస్‍యూవీకి సంబంధించి పూర్తి వివరాలు, ఫీచర్స్, మరింత సమాచారం వెల్లడైంది.
ఇక్కడ ఫోటోలలో చూసినట్లుగా, 2024కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ మొత్తం 7 కలర్స్ లో లభించనుంది. అవి ఏవి అంటే HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, మరియు X-లైన్. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు దీనిని 8 మోనోటోన్, 2 డ్యూయల్-టోన్ కలర్స్, మరియు మ్యాట్ ఫినిష్ తో ఎంచుకునే అవకాశం ఉంది. ఇక రెండోది సిగ్నేచర్ ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ పెయింట్ వచ్చింది,అయితే డ్యూయల్-టోన్ ఆప్షన్స్ లో ఇంటెన్స్ రెడ్ మరియు గ్లేసియర్ వైట్ పెర్ల్ ఉన్నాయి, రెండూ అరోరా బ్లాక్ పెర్ల్ రూఫ్‌తో రానున్నాయి.
కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో పీటర్ ఆలివ్ (కొత్త), గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ మరియు క్లియర్ వైట్ అనే 8 మోనో టోన్ పెయింట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంతే కాకుండా 3 ఇంజన్ ఆప్షన్స్ మరియు 5 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో కూడా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో అందుబాటులోకి రానున్నాయి, వీటి స్పెసిఫికేషన్స్ గురించి మరిన్ని వివరాలను త్వరలోనే మేము మా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్