- జనవరి-2024 నుంచి సోనెట్ ఫేస్‍లిఫ్ట్ డెలివరీ ప్రారంభం
- 7 వేరియంట్లలో లభ్యం
కియా ఇండియా అధికారికంగా దేశంలో తన సరికొత్త మోడల్ అయిన సోనెట్ ఫేస్లిఫ్ట్ బుకింగ్స్ ని ప్రారంభించింది. అప్‍డేటెడ్ కాంపాక్ట్ ఎస్‍యూవీని కియా బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ డీలర్‌షిప్స్ ద్వారా రూ. 25,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.
కొత్త కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క వేరియంట్ ఆప్షన్స్ చూస్తే సోనెట్ ఫేస్‌లిఫ్ట్ HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే 7 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, అప్‍డేటెడ్ సోనెట్ లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జ్, బోస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ పరంగా, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, లెవెల్-1ఏడీఏఎస్(అడాస్)సూట్, బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
మెకానికల్ గా, కొత్త కియా సోనెట్ ఇంతకు ముందున్న మూడు ఇంజిన్‌లను ఇప్పుడు కూడా ఫేస్‍లిఫ్టులో కొనసాగిస్తుంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ నిర్వహించనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్