- రూ.25 వేల టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్ ఓపెన్
- రేపే సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ధరలు ప్రకటన
చివరి నెలలో, ఇండియాలో సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ని కియా ఇండియా ఆవిష్కరించింది. ఇప్పుడు, హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడుతున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క అధికారిక లాంచ్ జనవరి 12వ తేదీన జరగనుండగా, దాని కంటే ముందు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. ముఖ్యమైన అంశం ఏంటి అంటే, సబ్-4-మీటర్ ఎస్‍యూవీని కేవలం రూ.25 వేల టోకెన్ అమౌంట్ బుక్ చేసుకోవచ్చు. లాంచ్ తర్వాత వీటి డెలివరీ ప్రారంభంకానుంది.
కొత్త కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క వేరియంట్ ఆప్షన్స్ చూస్తే సోనెట్ ఫేస్‌లిఫ్ట్ HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే 7 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఎవరైతే కస్టమర్స్ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని కొనాలని భావిస్తున్నారో వారు మొత్తం 11 కలర్స్ నుంచి వారికి నచ్చిన కలర్ ని ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్,ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, క్లియర్ వైట్,పీటర్ ఆలివ్, అరోరా బ్లాక్ పెర్ల్‌తో గ్లేసియర్ వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్‌తోగ్లేసియర్ వైట్ పెర్ల్ మరియు ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ పెయింట్ వంటి కలర్స్ ఉన్నాయి.
ముందుగా ఫీచర్స్ గురించి చెప్పాలంటే, 2024 సోనెట్ లో 360-డిగ్రీ కెమెరా, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-1 ఏడీఏఎస్(అడాస్) మరియు అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ గా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండనున్నాయి.
మెకానికల్ గా, కొత్త కియా సోనెట్ లో ఏ మాత్రం మార్పులు చేయకుండా కియా ఇంతకు ముందున్న మూడు ఇంజిన్‌లను ఇప్పుడు ఫేస్‍లిఫ్టులో కూడా కొనసాగిస్తుంది. ఇందులో 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ నిర్వహించనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్