- 2020లో అరంగేట్రం చేసిన కియా సోనెట్
- జనవరి-2024లో కియా సోనెట్ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశం
ఇండియాలో కియా సెల్టోస్ విజయవంతమైన తర్వాత ఈ ఆటోమేకర్ 2020లో సోనెట్ ఎస్‍యూవీని పరిచయం చేసింది. లాంచ్ అయినప్పటి నుండి ఈ 5-సీటర్ ఎస్‍యూవీకి ఇండియా నలుమూలల నుండి అద్బుత స్పందన లభించడంతో ఎస్‍యూవీ సెగ్మెంట్లో కియా సోనెట్ బెస్ట్-సెల్లింగ్ కారుగా నిలిచింది. ఇప్పుడు, ఈ బ్రాండ్ ఇండియాలో 3.68 లక్షల యూనిట్స్ సోనెట్ కార్లను విక్రయించి ఒక అద్బుతమైన మైల్‍స్టోన్‍ని సాధించింది.
ప్రస్తుతం, హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడుతున్న కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, మరియు X-లైన్ అనే 7 వేరియంట్స్ లో అందించబడుతుంది. ఈ ఎస్‍యూవీని ధరలు రూ. 7.79 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమై వివిధ వేరియంట్స్ లో రూ. 14.89 లక్షలు (ఎక్స్-షోరూం)తో టాప్-స్పెక్ X-లైన్ వేరియంట్ వరకు ఉన్నాయి. హుడ్ కింద, కియా సోనెట్‌ను 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో పొందవచ్చు.
ఇతర వార్తలలో చూస్తే, కియా కార్ల కంపెనీ తాజాగా ఇండియాలో సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ని ఆవిష్కరించింది, దీని ధరలు వచ్చే నెల జనవరి-2024లో ప్రకటించే అవకాశం ఉంది. 2020లో లాంచ్ అయినప్పటి నుంచి ఈ సబ్-4-మీటర్ ఎస్‍యూవీ నుండి ఇదే మొట్టమొదటి అప్ డేట్ మరియు ఇది 7 వేరియంట్స్ లో 11 కలర్స్ లో అందించబడుతుంది. మెకానికల్ గా చెప్పాలంటే, అప్‍డేటెడ్ సోనెట్ ఇంతకు ముందున్న మోడల్ లాగే ఏ మాత్రం మార్పులు లేకుండా ఒకే రకమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో అందించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్