- మెరుగైన సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం
- పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో లభ్యం
కియా ఇండియా దాని మోస్ట్ పాపులర్ ఎస్యూవీ అయిన సెల్టోస్ లోని X-లైన్ వేరియంట్‌ని అద్భుతమైన కొత్త ‘అరోరా బ్లాక్ పెర్ల్’ కలర్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ ద్వారా ఇప్పటికే ఉన్న మ్యాట్ గ్రాఫైట్ వేరియంట్‌ను మరింత మెరుగుపరిచింది. ఇప్పుడు,కస్టమర్లు వారి వెహికిల్ ని మరింత కస్టమైజ్ చేయడానికి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పవచ్చు.
ఈ కొత్త వేరియంట్లో ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లు, ఔటర్ రియర్-వ్యూ మిర్రర్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు టెయిల్‌గేట్ గార్నిష్‌తో పాటుగా కారు వివిధ బాగాలపై గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వబడింది. అదనంగా, స్కిడ్ ప్లేట్లు, సైడ్ డోర్ గార్నిష్ మరియు వీల్ సెంటర్ క్యాప్‌లకు 'సన్ ఆరెంజ్' యాక్సెంట్స్ కారును మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇది బ్లాక్ గ్లోసీ అవుట్‌లైన్‌తో పెద్ద 18-ఇంచ్ డ్యూయల్-టోన్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్‌తో రాగా, దీని టెయిల్‌గేట్‌పై 'X-లైన్' బ్యాడ్జ్ దీన్ని మరింత ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది.
కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జున్సు చో మాట్లాడుతూ, “కియా సెల్టోస్ మా బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా ఉంది. లేటెస్టుగా మేము 5 లక్షల యూనిట్ల సేల్స్ మైల్ స్టోన్ ని చేరుకున్నాము. డిమాండ్ మరియు ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వివిధ రకాల మరియు ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ కోసం చూసే కస్టమర్లకు X-లైన్ వేరియంట్లో కొత్త బ్లాక్ కలర్ ఆప్షన్‌ను పరిచయం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.
మొత్తం మీద, ఇప్పుడు కియా సెల్టోస్ 'X-లైన్' కొత్త బ్లాక్ అవతార్ రాకతో, ఈ కారు మరింత బోల్డ్ గా మరియు మరింత పవర్ ఫుల్ లుక్ ని అందుకుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్