- స్టాండర్డ్ మోడల్ కంటే మరింత పవర్‍ఫుల్‍గా ఉన్న టర్బో పెట్రోల్
- ఆటోమేటిక్ మరియు మాన్యువల్‌కు సమానంగా ఉన్న క్లెయిమ్డ్ మైలేజ్
కియా సెల్టోస్ అనేది పెట్రోల్ మరియు డీజిల్ మోడల్‌లతో విభిన్నమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో ఒక పాపులర్ అయిన ఎస్‌యువి. టర్బో-పవర్డ్ సెల్టోస్ కొత్త 1.5-లీటర్ మిల్ ను పొందింది, ఇది ఓల్డ్ 1.4 లీటర్ మిల్ కంటే శక్తివంతమైనది మరియు సామర్థ్యం కలిగినది. మేము దాని రియల్ వరల్డ్ మైలెజ్ ని తెలపడానికి కార్‌వాలే ఫ్యూయల్ –ఎఫిషియన్సీ కోసం ద్వారా కొత్తదాన్ని ఉంచాము. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ టర్బో-పెట్రోల్ డిసిటి లో ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ మైలేజ్ 17.9కేఎంపిఎల్ గా ఉంది. రియల్ వరల్డ్ లో కియా సెల్టోస్ టర్బో 1.5 ఏటీ ఎంత వరకు ఫ్యూయల్-ఎఫిషియంట్ అని మీరు అనుకుంటున్నారు?
సిటీలో కియా సెల్టోస్ టర్బో 1.5 ఏటీ మైలేజ్
మా సిటీ టెస్ట్ సైకిల్ గురించి నేరుగా చెప్పాలంటే, 79.8కిమీలు డ్రైవింగ్ చేసిన తర్వాత చూస్తే, సెల్టోస్ 7.36 లీటర్ల పెట్రోల్‌ను ఉపయోగించింది. డ్రైవర్ డిస్‌ప్లే సగటు ఫ్యూయల్ ఎఫిషియన్సీని 9.8కేఎంపిఎల్ గా చూపుతుంది కానీ, దాని రియల్ వరల్డ్ మైలేజ్ 10.84కేఎంపిఎల్ గా ఉంది. ఇది చాలా తక్కువగా కనిపించవచ్చు కానీ 1.5 టన్ను బరువున్న ఎస్‌యువికి ఇది సంతృప్తికరమైనది అని చెప్పవచ్చు.
కియా సెల్టోస్ టర్బో-పెట్రోల్ హైవేపై 1.5ఆటోమేటిక్ మైలేజ్
హైవేపై, 4.81 లీటర్ల ఫ్యూయల్ ని వినియోగించి మేము 77.3కిమీలు డ్రైవ్ చేసాము, ఫలితంగా పరీక్షించిన తర్వాత 16.07కేఎంపిఎల్ మైలేజ్ వచ్చింది. అదే సమయంలో,ఎంఐడిలో చూపబడిన ఫ్యూయల్ ఎకానమీ ఆ సమయంలో 16.4కేఎంపిఎల్ గా ఉంది. సగటుగా ఇది ఆకట్టుకోకపోవచ్చు కానీ ఇది మోస్ట్ పవర్ ఫుల్ ఇంకా భారీ ఎస్‌యువి కాబట్టి మేము ఆశించిన దానికి చాలా దగ్గరగా ఉంది.
కియా సెల్టోస్ లో ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ స్పెసిఫికేషన్స్
ఈ 2023 కియా సెల్టోస్ టర్బో-పెట్రోల్ 1.5-లీటర్ 4-సిలిండర్ ఇంజిన్ ద్వారా 5,500rpm వద్ద 158bhp మరియు 1,500-3,500rpm మధ్య 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందే చెప్పినట్లుగా, దీని క్లెయిమ్డ్ మైలేజ్ 17.9కేఎంపిఎల్ మరియు 6-స్పీడ్ ఐఎంటి యొక్క క్లెయిమ్డ్ మైలేజ్ 17.7కేఎంపిఎల్ గా ఉంది. ఇది స్టాండర్డ్ మోడల్ లో నేచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5-లీటర్ పెట్రోల్‌తో వస్తుంది, ఇది 133bhp మరియు 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అలాగే దీనిని 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటితో పొందవచ్చు. మాన్యువల్ ఏఆర్ఏఐ మైలేజ్ 17కేఎంపిఎల్ ఇస్తుండగా, సివిటి 17.7కేఎంపిఎల్ మైలేజీని ఇస్తుంది. అంతేకాకుండా మరింత పొదుపైన ఆప్షన్ ను ఇష్టపడే కస్టమర్ల కోసం, 114bhp మరియు 250Nm ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ ఐఎంటి లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడుతుంది. మరోవైపు ఐఎంటి మైలేజ్ 20.7కేఎంపిఎల్ కాగా మరియు ఏటీ మైలేజ్ 19.1కేఎంపిఎల్ గా ఉంది. రియల్ వరల్డ్ మైలేజీ కోసం కూడా మేము త్వరలో ఈ వేరియంట్‌లను టెస్ట్ చేయనున్నాము.
అనువాదించిన వారు: రాజపుష్ప