- అందుబాటులో 9వేరియంట్స్
- రూ. 10.90 లక్షలునుండి ధరలు ప్రారంభం
కియా ఇండియాలో సెల్టోస్ ధరలను రూ. 30,000 వరకు పెంచింది.మిడ్-సైజ్ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు నుండి టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 20.30 లక్షలువరకు (అన్నిధరలు, ఎక్స్-షోరూమ్) 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొన్ని సెలెక్టెడ్ వేరియంట్స్ మాత్రమే ధరలను పెంచడంతో , ఇతర ట్రిమ్‌ల ధరలలో ఎటువంటి మార్పులు చేయలేదు.
కియా సెల్టోస్‌ను HTE, HTK, HTK ప్లస్, HTX, GTX, GTX ప్లస్ మరియు X లైన్‌తో సహా మల్టీ వేరియంట్స్ లో పొందవచ్చు. వీటిలో, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ రీతిగా ఉన్న GTX ప్లస్ మరియు X లైన్ వేరియంట్స్ ధరలు రూ. 20,000 నుండి రూ. 30,000 వరకు పెరిగాయి.
మెకానికల్‌గా, సెల్టోస్ 3 పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో ఉంది. అవి ఏంటి అంటే - 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, సివిటి మరియు 7-స్పీడ్ సివిటి యూనిట్ తో కలిపి ఉన్నాయి.
ఇతర వార్తలలో చూస్తే, కియా ఇండియా కారెన్స్ ఎంపివి X-లైన్ వేరియంట్‌ను రూ. 18.95 లక్షలు ధర ట్యాగ్‌లో విడుదల చేసింది (ఎక్స్-షోరూమ్). మరోవైపు, వాహన తయారీ సంస్థ కారెన్స్ కు సంబంధించిన సెలెక్టెడ్ వేరియంట్స్ పై ధరలను పెంచింది.
అనువాదించిన వారు:రాజపుష్ప