- అందుబాటులో ఉన్నరెండు కొత్త వేరియంట్స్
- రూ. 10.90లక్షలతో ధరలు ప్రారంభం
కియా ఇండియా తన అత్యంత పాపులర్ ఎస్యువి సెల్టోస్ ధరలను ఇండియాలో పెంచింది. హ్యుందాయ్ క్రెటాకి పోటీగా ఉన్న దీనిని రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఫలితంగా, ఏప్రిల్‌లో సెల్టోస్‌ను బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 67,000 వరకు ప్రీమియం అమౌంట్ ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ అమౌంట్ ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
కియా సెల్టోస్ ని HTE, HTK, HTK+, HTX, HTX+, GTX ప్లస్ (S), GTX+, ఎక్స్-లైన్ (S), ఎక్స్-లైన్ అనే తొమ్మిది వేరియంట్స్ లో పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పొందవచ్చు. అలాగే ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి కియా సెల్టోస్ ధర రూ. 2,000 నుండి రూ. 67,000వరకు పెరగవచ్చు. దీంతో , ఇప్పుడు సెల్టోస్ ధరలు రూ. 10.90 లక్షల నుండి రూ. 20.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)మధ్య ఉన్నాయి. కియా సెల్టోస్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ మరియు ఆన్-రోడ్ ధరల వివరాలను కార్వాలే వెబ్సైట్ ని సందర్శించి పొందవచ్చు.
ఇటీవలే, కొరియన్ ఆటోమేకర్ HTK+ ఆటోమేటిక్ వేరియంట్‌ని పెట్రోల్ మరియు డీజిల్ తో లాంచ్ చేయగా, ఈ మోడల్ ధర వరుసగా రూ. 15.40 లక్షలు మరియు రూ. 16.90 లక్షలు ఉంది. ఈ కొత్త వేరియంట్లో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ మరియు కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప