- లేటెస్టుగా కొత్త GTX వేరియంట్ ని అందుకున్న సెల్టోస్
- రూ. 10.90 లక్షలతో సెల్టోస్ ధరలు ప్రారంభం
కియా ఇండియా ద్వారా బెస్ట్ సెల్లింగ్ మోడల్ సెల్టోస్ ఇండియన్ మార్కెట్ ని శాసిస్తుండగా, ప్రస్తుతం ఈ పాపులర్ ఎస్‍యూవీ ధరలలో కియా మార్పులు చేసింది. ఈ నెలలో సెల్టోస్ మోడల్ పై కియా రూ. 19,000 వరకు ధరలను పెంచింది. దీంతో, సెల్టోస్ ఇప్పుడు రూ. 10 90 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లభిస్తుంది.
లేటెస్టుగా సెల్టోస్ కొత్త GTX వేరియంట్ ని అందుకోవడంతో సెల్టోస్ ని ఇప్పుడు HTE, HTK, HTK+, HTX, HTX+, GTX, GTX+ (S), GTX+, X-లైన్ (ఎస్), మరియు X-లైన్ ని 10 వేరియంట్లలో పొందవచ్చు. ధరల విషయానికి వస్తే, సెల్టోస్ లోని సెలెక్ట్ వేరియంట్లపై రూ. 2 వేల నుంచి రూ. 19 వేల వరకు ధర పెరిగింది. ధరల పెంపు తర్వాత, సెల్టోస్ టాప్-స్పెక్ X-లైన్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ రూ. 20.37 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది.
ధర మరియు ఫీచర్ల పరంగా, ఈ కొత్త GTXవేరియంట్ HTX+(ఎస్)మరియు GTX+ (ఎస్) వేరియంట్ల మధ్య పొజిషన్ చేయబడింది. ఫీచర్ల పరంగా, ఈ సెల్టోస్ కారులో 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇతర వార్తలలో చూస్తే, ఈ కొరియన్ ఆటోమేకర్ జూలై-2024లో సోనెట్ ఎస్‍యూవీ ధరలకు కూడా రూ.27,000 వరకు ధరలను పెంచింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్