- సగానికి కంటే ఎక్కువగా పెట్రోల్ పవర్ ట్రెయిన్లను ఎంచుకుంటున్న కస్టమర్లు
- ఇండియాలో రూ.10.90 లక్షలతో ప్రారంభమైన సెల్టోస్ ధరలు
అప్‍డేటెడ్ మోడల్ లాంచ్ అయిన 6 నెలల తర్వాత, తాజాగా కియా ఇండియా దేశవ్యాప్తంగా సెల్టోస్ ద్వారా ఒక లక్ష బుకింగ్స్ మైల్‍స్టోన్‌ని సాధించింది. ఆగస్టు-2019లో సెల్టోస్ లాంచ్ అయినప్పటి నుండి ఈ కార్ మేకర్ 6 లక్షల సెల్టోస్ కార్లను విక్రయించింది. ఈ సందర్భంగా కారు బుకింగ్స్ కి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. ఇప్పుడు మనం వాటి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
కియా ప్రకారం, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ బుకింగ్స్ నిష్పత్తి 58:42 గా ఉంది. అంటే 58 శాతం కస్టమర్లు పెట్రోల్ కార్లను ఎంచుకుంటుండగా, 42 శాతం కస్టమర్లు డీజిల్ కార్లను ఎంచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే, దాదాపుగా మొత్తం బుకింగ్స్ లో 50 శాతం ఆటోమేటిక్ వెర్షన్స్ ద్వారా వచ్చినవే ఉన్నాయి. అదనంగా, 40 శాతం సెల్టోస్ కస్టమర్లు ఏడీఏఎస్ (అడాస్) సూట్ తో ఈ మోడల్ ని ఎంచుకున్నారు, అదే విధంగా 80 శాతం కస్టమర్లు ఈ మోడల్ ని పనోరమిక్ సన్ రూఫ్ తో ఎంచుకున్నారు. ఇంకా, 80 శాతం కొనుగోలుదారులు టాప్ వేరియంట్ ని కొనుగోలు చేశారు, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, HTK+ నుండి టాప్ వేరియంట్స్ ప్రారంభమైనట్లు కియా తెలిపింది.
కియా సెల్టోస్ ధర ఇండియాలో రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభంకాగా, 7 వేరియంట్లలో మరియు 10 కలర్లలో అందించబడింది. ఇక పవర్ ట్రెయిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, కస్టమర్లు దీనిని 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటార్, 1.5-డీజిల్ మోటార్, మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్